Gold Price Today: ఇటీవలి కాలంలో ట్రంప్ దూకుడు చర్యలు సేఫ్ హెవెన్ గోల్డ్ రేట్లను అడ్డుఅదుపూ లేకుండా పెంచేసింది. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య యుద్ధ భయాలు పెరగటం కూడా రేట్లను అమాంతం పెంచాయి. ఈ క్రమంలో ప్రధానంగా భారతీయ పసిడి ప్రియులు కొత్త కొనుగోళ్లను నిలిపివేసి ధరల తగ్గుదల కోసం ఎదురుచూస్తున్నారు. షాపింగ్ చేయటానికి ముందు తగ్గిన ధరలను ముందుగా తెలుసుకోవాలి.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.7000 భారీ తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7940, ముంబైలో రూ.7940, దిల్లీలో రూ.7955, కలకత్తాలో రూ.7940, బెంగళూరులో రూ.7940, కేరళలో రూ.7940, పూణేలో రూ.7940, వడోదరలో రూ.7945, జైపూరులో రూ.8026, అహ్మదాబాదులో రూ.7945, కోయంబత్తూరులో రూ.8011, మంగళూరులో రూ.7940, నాశిక్ లో రూ.8014, అయోధ్యలో రూ.7955, గురుగ్రాములో రూ.8026, నోయిడాలో రూ.8026 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే 100 గ్రాములకు రూ.7100 తగ్గింపును చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లోని రిటైల్ గోల్డ్ విక్రయ ధరల తగ్గింపును నేడు పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8667, ముంబైలో రూ.8667, దిల్లీలో రూ.8682, కలకత్తాలో రూ.8667, బెంగళూరులో రూ.8667, కేరళలో రూ.8667, పూణేలో రూ.8667, వడోదరలో రూ.8672, జైపూరులో రూ.8754, అహ్మదాబాదులో రూ.8672, కోయంబత్తూరులో రూ.8011, మంగళూరులో రూ.8667, నాశిక్ లో రూ.8670, అయోధ్యలో రూ.8682, గురుగ్రాములో రూ.8754, నోయిడాలో రూ.8754గా ఉన్నాయి.
గోల్డ్ రేట్ల ర్యాలీ..
ప్రస్తుతం పెరుగుతున్న పసిడి ధరలు దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. వాస్తవానికి అమెరికా తాజా ట్రేడ్ టారిఫ్స్ కారణంగా ముందస్తు వ్యూహాత్మక రక్షణ చర్యల్లో భాగంగా చైనా నుంచి పసిడి డిమాండ్ పెరగటంతో అంతర్జాతీయంగా పసిడి ధరలు సరికొత్త రికార్డు స్థాయిలకు చేరుకున్నాయి. ప్రస్తుతం చైనా-యూఎస్ ట్రేడ్ వార్ కారణంగా అప్రమత్తమైన ప్రపంచ దేశాల నుంచి కూడా పసిడికి డిమాండ్ పెరుగుతోంది. ఈ కారణాలతో గోల్డ్ రేట్లు సామాన్యులకు అందనంత స్థాయిలకు పెరిగిపోయాయి.
తెలంగాణలోని నగరాలైన హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7940గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8667 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,07,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications