Gold Rate: దడపుట్టిస్తున్న గోల్డ్ ధరలు.. నేడు ఏపీ, తెలంగాణలో తులం రేటెంతంటే..
Gold Price Today: 2024లో పసిడి ధర పెరుగుదలను చూసిన భారతీయులు వీటి ధరలు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా అంటూ కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టారు. అయితే ఊహించిన దానికి విరుద్ధంగా కొత్త సంవత్సరం తొలిరోజు నుంచే గోల్డ్ రిటైల్ విక్రయ ధరలు పెరుగుదలను చూశాయి.
భారతీయులకు ఎంతో ప్రీతికరమైన పసిడి ధరలు పెరగకుండా అడ్డుకోవటంలో కేంద్ర ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటుందా అనే దానిపై ఆర్థిక శాఖ వివరణ ఇచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి బదులిస్తూ.. 2024-25 కేంద్ర బడ్జెట్‌లో బంగారం దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించినట్లు వెల్లడించారు. బంగారాన్ని సామాన్య కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచటం దీని లక్ష్యంగా ఆయన వెల్లడించారు. దీనికి తోడు సెంట్రల్ బ్యాంక్ విధివిధానాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి అంశాలు రేట్లపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఈ క్రమంలో నేడు పసిడి ధరల్లో ఎలాంటి మార్పులు లేకుండానే కొనసాగుతున్నాయి. దీంతో నేటి ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7215గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7871 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7215గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7871 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.99,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
దేశంలో వరుస పండుగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావటంతో చాలా మంది ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు జనవరిలో రానున్న సంక్రాంతి కోసం కూడా చాలా మంది ఇప్పటి నుంచే గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిన్న భారీ ధరల పతనంతో ఆలస్యం చేయకుండా షాపింగ్ కి వెళ్లాలని చూస్తున్నారు. అలాంటి వారు ముందుగా నేటి రిటైల్ మార్కెట్లో ధరలను గమనించివెళ్లటం మంచిది.


Click it and Unblock the Notifications