Gold Rate: శుభవార్త.. కుప్పకూలిన గోల్డ్ ధరలు, నేడు రూ.4,900 దిగొచ్చిన పసిడి రేటు..
Gold Price: వరుసగా రెండు రోజుల నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య పన్నుల ప్రకటనలతో పెరిగిన పసిడి ధరలు నేడు మళ్లీ స్థిరపడ్డాయి. ఈ క్రమంలోనే సేఫ్ హెవెన్ గోల్డ్ రేట్లు తిరిగి తగ్గటం భారతీయ కొనుగోలుదారులకు పెద్ద ఊరటను అందిస్తోంది. పెళ్లిళ్లు వంటి శుభకార్యాల జోరు కొనసాగుతున్న సమయంలో ధరల పతనం సంతోషాన్ని కలిగిస్తోందని షాపుల యజమానులు సైతం పేర్కొంటున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.4,500 భారీ తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.8020, ముంబైలో రూ.8020, దిల్లీలో రూ.8035, కలకత్తాలో రూ.8020, బెంగళూరులో రూ.8020, కేరళలో రూ.8020, వడోదరలో రూ.8025, అహ్మదాబాదులో రూ.8025, జైపూరులో రూ.8035, లక్నోలో రూ.8035, కోయంబత్తూరులో రూ.8020, మంగళూరులో రూ.8020, నాశిక్ లో రూ.8023, అయోధ్యలో రూ.8035, బళ్లారిలో రూ.8020, గురుగ్రాములో రూ.8035, నోయిడాలో రూ.8035 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.4,900 భారీ పతనాన్ని చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన గోల్డ్ రిటైల్ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8749, ముంబైలో రూ.8749, దిల్లీలో రూ.8764, కలకత్తాలో రూ.8749, బెంగళూరులో రూ.8749, కేరళలో రూ.8749, వడోదరలో రూ.8025, అహ్మదాబాదులో రూ.8754, జైపూరులో రూ.8764, లక్నోలో రూ.8764, కోయంబత్తూరులో రూ.8749, మంగళూరులో రూ.8749, నాశిక్ లో రూ.8752, అయోధ్యలో రూ.8764, బళ్లారిలో రూ.8749, గురుగ్రాములో రూ.8764, నోయిడాలో రూ.8764 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
మెుత్తం మీద ఈవారంలో కూడా బంగారం ధరల అధిక ఒడిదొడుకులను చూస్తాయని భావిస్తున్నట్లు పృథ్వీఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్‌కు చెందిన మనోజ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకునే నిర్ణయాల ప్రభావం ఎలా ఉండనుందనే ఆందోళనలు అస్థిరతకు కారణమని వెల్లడించారు. ఇదే క్రమంలో డొనాల్డ్ ట్రంప్ ఇనాగరల్ స్పీచ్ సమయంలో గోల్డ్, సిల్వర్ ధరలు చాలా అధిక ఓలటాలిటీకి గురైంది. నిపుణుల అంచనాల ప్రకారం పసిడి ధర ఔన్సుకు 3000 డాలర్లకు చేరుకోవచ్చని అంచనాలు ఉన్నాయి. ఫ్యూచర్స్ మార్కెట్లో కూడా గోల్డ్ భారీగా ధర పెరుగుతూ భవిష్యత్తు ధరలపై క్లారిటీ వస్తోంది.
తెలంగాణలోని నగరాలైన హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.8020గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8749 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,000 పెరిగి రూ.1,08,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications