Gold Price Today: వరుసగా పసిడి ధరలు ఇటీవల పెరగటంతో ఆందోళన చెందుతున్న భారతీయ వినియోగదారులకు శుభవార్త వచ్చింది. వారాంతంలో గోల్డ్ రేట్లు ఒక్కసారిగా కుప్పకూలటంతో ప్రజలు షాపింక్ చేయటం గురించి ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన రేట్లను పరిశీలించిన తర్వాత కొనుగోలు చేయటం ఉత్తమం.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.4,500 భారీ తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8025, ముంబైలో రూ.8025, దిల్లీలో రూ.8030, కలకత్తాలో రూ.8025, బెంగళూరులో రూ.8025, కేరళలో రూ.8025, వడోదరలో రూ.8030, అహ్మదాబాదులో రూ.8030, జైపూరులో రూ.8030, లక్నోలో రూ.8030, మంగళూరులో రూ.8025, నాశిక్ లో రూ.8028, అయోధ్యలో రూ.8030, బళ్లారిలో రూ.8025, గురుగ్రాములో రూ.8030, నోయిడాలో రూ.8030 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే 100 గ్రాములకు ఏకంగా రూ.2,900 తగ్గుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ విక్రయ పసిడి ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8755, ముంబైలో రూ.8755, దిల్లీలో రూ.8755, కలకత్తాలో రూ.8755, బెంగళూరులో రూ.8755, కేరళలో రూ.8755, వడోదరలో రూ.8760, అహ్మదాబాదులో రూ.8760, జైపూరులో రూ.8755, లక్నోలో రూ.8755, మంగళూరులో రూ.8755, నాశిక్ లో రూ.8780, అయోధ్యలో రూ.8755, బళ్లారిలో రూ.8755, గురుగ్రాములో రూ.8755, నోయిడాలో రూ.8755గా ఉన్నాయి.
నిరంతర పెరుగుదల ఎందుకు..?
వాస్తవానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాలపై వాణిజ్య పన్నులను వరుసగా ప్రకటిస్తున్న వేళ సెంట్రల్ బ్యాంకుల నుంచి ఇప్పటికే సేఫ్ హెవెన్ గోల్డ్ కోసం నిరంతరం డిమాండ్ పెరుగుతూనే ఉంది. దీనికి తోడు చరిత్రలో తొలిసారిగా అమెరికా దిగ్గజ బ్యాంకులైన హెచ్ఎస్బీసీ, జేపీ మోర్గన్ ఇటీవల బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ నుంచి తమ పసిడి నిల్వలను భౌతికంగా వెనక్కి తీసుకున్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం పసిడి ధర ఔన్సుకు 3000 డాలర్లకు చేరుకోవచ్చని అంచనాలు ఉన్నాయి. ఫ్యూచర్స్ మార్కెట్లో కూడా గోల్డ్ భారీగా ధర పెరుగుతూ భవిష్యత్తు ధరలపై క్లారిటీ వస్తోంది.
తెలంగాణలోని నగరాలైన హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.8025గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8810 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,07,900 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications