Gold Rate: శుభవార్త.. సోమవారం కుప్పకూలిన గోల్డ్ రేటు.. నేడు రూ.4,900 తగ్గిన గోల్డ్..
Gold Price Today: గడచిన వారం నిరంతరంగా పెరిగిన గోల్డ్ ధర కొనుగోలుదారులను ఆందోళనకి గురిచేసింది. అయితే తాజాగా ధనత్రయోదశి, దీపావళి దగ్గరపడిన వేళ ధరలు దిగిరావటం ఇన్వెస్టర్లను ఆనందానికి గురిచేస్తోంది. చాలా మంది రేట్ల ఊగిసలాటలు కొనసాగుతున్న వేళ నేడు త్వరపడి షాపింగ్ ముగించాలని చూస్తున్నారు. సాయంత్రం గోల్డ్, సిల్వర్ ఆభరణాలను కొనుగోలు చేయాలని చూస్తున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.4500 తగ్గుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7315, ముంబైలో రూ.7315, దిల్లీలో రూ.7330, కలకత్తాలో రూ.7315, బెంగళూరులో రూ.7315, కేరళలో రూ.7315, వడోదరలో రూ.7320, జైపూరులో రూ.7330, లక్నోలో రూ.7330, మధురైలో రూ.7315, మంగళూరులో రూ.7315, నాశిక్ లో రూ.7318, అయోధ్యలో రూ.7330, బళ్లారిలో రూ.7315, గురుగ్రాములో రూ.7330, నోయిడాలో రూ.7330గా కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.4900 తగ్గాయి. దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7980, ముంబైలో రూ.7980, దిల్లీలో రూ.7995, కలకత్తాలో రూ.7980, బెంగళూరులో రూ.7980, కేరళలో రూ.7980, వడోదరలో రూ.7985, జైపూరులో రూ.7995, లక్నోలో రూ.7995, మధురైలో రూ.7980, మంగళూరులో రూ.7980, నాశిక్ లో రూ.8031, అయోధ్యలో రూ.7995, బళ్లారిలో రూ.7980, గురుగ్రాములో రూ.7995, నోయిడాలో రూ.7995గా ఉన్నాయి. అయితే ఇవి చట్టపరమైన పన్నులు, వ్యాపారి లాభాలు, తరుగు మజూరి వంటి ఖర్చులను జోడించక మునుపటి ధరలుగా గుర్తుంచుకోండి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7315గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7980 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7315గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7980 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,07,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు బంగారం ధరల పెరుగుదలకు ఒక కారణంగా నిలిచాయి. భౌగోళిక రాజకీయ అస్థిరత సమయంలో బంగారం తరచుగా సురక్షితమైన ఆస్తిగా కనిపిస్తుంది. ఈ క్రమంలో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు. ఈ పరిస్థితులు పసిడి ధరను పెంచుతారు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, విస్తృత ఆర్థిక పరిస్థితులు వంటి ఇతర అంశాలు కూడా బంగారం ధరల కదలికలో పాత్ర పోషిస్తాయి. మీకు బంగారం పెట్టుబడులపై ఆసక్తి ఉంటే వార్తలు, మార్కెట్ ట్రెండ్స్ రెండింటినీ గమనిస్తూ ఉండటం మంచిది.


Click it and Unblock the Notifications