Gold Rate: వరుసగా 3వ రోజు కుప్పకూలిన గోల్డ్.. గోల్డెన్ టైం మిస్ అయితే రేట్లు పెరగొచ్చు.. నేడు రూ.4,400 పతనం
Gold Price Today: చాలా కాలంగా ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితుల కారణంగా బంగారంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలుపు ఇన్వెస్టర్లలో తిరిగి నమ్మకాన్ని నింపుతోంది. దీంతో చాలా మంది ప్రస్తుతం తమ డబ్బును తిరిగి ఈక్విటీలు, బాండ్స్ మార్కెట్లలోకి తరలిస్తున్నారని తెలుస్తోంది. ఇది పరోక్షంగా బంగారం ధరలపై ఒత్తిడిని తగ్గిస్తూ రోజురోజుకూ పతనం అవుతోంది. ఈ క్రమంలో చాలా కాలంగా వేచి ఉన్న భారతీయ కొనుగోలుదారులు ప్రస్తుతం షాపింగ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
నేడు తగ్గిన పసిడి ధరలు దేశవ్యాప్తంగా 22 క్యారెట్లకు నిన్నటితో పోల్చితే రూ.4000 తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో తగ్గిన తర్వాత తాజా రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7045, ముంబైలో రూ.7045, దిల్లీలో రూ.7060, కలకత్తాలో రూ.7045, బెంగళూరులో రూ.7045, కేరళలో రూ.7045, పూణేలో రూ.7045, వడోదరలో రూ.7050, అహ్మదాబాదులో రూ.7050, జైపూరులో రూ.7060, లక్నోలో రూ.7060, మధురైలో రూ.7045, మంగళూరులో రూ.7045, నాశిక్ లో రూ.7048, మైసూరులో రూ.7045, అయోధ్యలో రూ.7060, బళ్లారిలో రూ.7045, నోయిడాలో రూ.7060గా నేడు కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే రూ.4,400 తగ్గింపును చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో తగ్గిన గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7685, ముంబైలో రూ.7685, దిల్లీలో రూ.7060, కలకత్తాలో రూ.7685, బెంగళూరులో రూ.7685, కేరళలో రూ.7685, పూణేలో రూ.7685, వడోదరలో రూ.7690, అహ్మదాబాదులో రూ.7690, జైపూరులో రూ.7700, లక్నోలో రూ.7700, మధురైలో రూ.7685, మంగళూరులో రూ.7685, నాశిక్ లో రూ.7688, మైసూరులో రూ.7685, అయోధ్యలో రూ.7700, బళ్లారిలో రూ.7685, నోయిడాలో రూ.7700గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7045గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7685 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7045గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7685 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,01,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
దేశంలో వరుస పండుగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావటంతో చాలా మంది ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు జనవరిలో రానున్న సంక్రాంతి కోసం కూడా చాలా మంది ఇప్పటి నుంచే గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిన్న భారీ ధరల పతనంతో ఆలస్యం చేయకుండా షాపింగ్ కి వెళ్లాలని చూస్తున్నారు. అలాంటి వారు ముందుగా నేటి రిటైల్ మార్కెట్లో ధరలను గమనించివెళ్లటం మంచిది. పైన పేర్కొన్న ధరలకు జీఎస్టీ, తరుగు, వ్యాపారి లాభాలు, మజూరి వంటివి కలపకముందు రేట్లుగా గుర్తుంచుకోవాలి.


Click it and Unblock the Notifications