Gold Rate: బడ్జెట్ తర్వాత కుప్పకూలిన గోల్డ్ రేటు.. నేడు ఏకంగా రూ.4,400 తగ్గిన పసిడి, స్టార్ట్ షాపింగ్..
Gold Price Today: గడచిన వారం రోజులుగా బంగారం ధరలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. బడ్జెట్లో ఆర్థిక మంత్రి మళ్లీ దిగుమతి సుంకం పెంచుతారేమో అనే ఆందోళనలు వెల్లువెత్తాయి. అయితే దీనికి విరుద్ధంగా జరగటంతో గోల్డ్ ధరలు తిరిగి తగ్గటం స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలో షాపింగ్ చేయటానికి ముందు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో తగ్గిన ధరలు తప్పక తెలుసుకోండి.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.4,000 తగ్గుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో తాజా రిటైల్ విక్రయ ధరలను తగ్గిన ప్రకారం పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7705, ముంబైలో రూ.7705, దిల్లీలో రూ.7720, కలకత్తాలో రూ.7705, బెంగళూరులో రూ.7705, కేరళలో రూ.7705, వడోదరలో రూ.7710, జైపూరులో రూ.7720, కోయంబత్తూరులో రూ.7705, మంగళూరులో రూ.7705, నాశిక్ లో రూ.7708, అయోధ్యలో రూ.7720, బళ్లారిలో రూ.7705, గురుగ్రాములో రూ.7720, నోయిడాలో రూ.7720 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.4,400 తగ్గుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8405, ముంబైలో రూ.8405, దిల్లీలో రూ.8420, కలకత్తాలో రూ.8405, బెంగళూరులో రూ.8405, కేరళలో రూ.8405, వడోదరలో రూ.8410, జైపూరులో రూ.8420, కోయంబత్తూరులో రూ.8405, మంగళూరులో రూ.8405, నాశిక్ లో రూ.8408, అయోధ్యలో రూ.8420, బళ్లారిలో రూ.8405, గురుగ్రాములో రూ.8420, నోయిడాలో రూ.8420గా ఉన్నాయి. కొనుగోలుదారులు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. పైన పేర్కొన్న ధరలు, తరుగు, మజూరి, జీఎస్టీ, వ్యాపారి లాభాలు వంటివి కలపక ముందివి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7705గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8405 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7705గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8405 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,07,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఈవారం ఇంకా తగ్గుతాయా..?
మెుత్తం మీద ఈవారంలో కూడా బంగారం, వెండి ధరల అధిక ఒడిదొడుకులను చూస్తాయని భావిస్తున్నట్లు పృథ్వీఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్‌కు చెందిన మనోజ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకునే నిర్ణయాల ప్రభావం ఎలా ఉండనుందనే ఆందోళనలు అస్థిరతకు కారణమని వెల్లడించారు. ఇదే క్రమంలో డొనాల్డ్ ట్రంప్ ఇనాగరల్ స్పీచ్ సమయంలో గోల్డ్, సిల్వర్ ధరలు చాలా అధిక ఓలటాలిటీకి గురైంది. రానున్న రోజుల్లో ఉక్రెయిన్-రష్యాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగితే పసిడికి డిమాండ్ తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications