Gold Rate: పసిడి ప్రియులకు శుభవార్త.. 2వ రోజూ కుప్పకూలిన గోల్డ్ , నేడు ధర రూ.7,100 డౌన్..
Gold Price Today: ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈ నాడే వచ్చింది అన్నట్లుగా ప్రస్తుతం పసిడి ధరలు భారీగా పతనాన్ని చూడటంతో భారతీయ కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతవారం పెరుగుతూ పోయిన గోల్డ్ రేట్లు ఈవారం మాత్రం సామాన్యులను కనికరిస్తున్నాయి. అంతర్జాతీయంగా మారుతున్న పరిణామాలు సైతం పసిడి ధరల పతనానికి కారణంగా నిపుణులు చెబుతున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.6,500 భారీ తగ్గుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో తగ్గిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7070, ముంబైలో రూ.7070, దిల్లీలో రూ.7085, కలకత్తాలో రూ.7070, బెంగళూరులో రూ.7070, కేరళలో రూ.7070, పూణేలో రూ.7070, వడోదరలో రూ.7075, అహ్మదాబాదులో రూ.7075, జైపూరులో రూ.7085, లక్నోలో రూ.7085, మధురైలో రూ.7070, మంగళూరులో రూ.7070, నాశిక్ లో రూ.7073, అయోధ్యలో రూ.7085, బళ్లారిలో రూ.7070, గురుగ్రాములో రూ.7085, నోయిడాలో రూ.7085 వద్ద కొనసాగుతున్నాయి. ఇక్కడ పేర్కొనబడిన ధరలు జీఎస్టీ, తరుగు, మజూరి లేదా ఇతర వ్యాపారి లాభాలు కలపక ముందు రేట్లని అందరూ గమనించాలి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.7,100 తగ్గుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన పసిడి విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7713, ముంబైలో రూ.7713, దిల్లీలో రూ.7728, కలకత్తాలో రూ.7713, బెంగళూరులో రూ.7713, కేరళలో రూ.7713, పూణేలో రూ.7713, వడోదరలో రూ.7718, అహ్మదాబాదులో రూ.7718, జైపూరులో రూ.7728, లక్నోలో రూ.7728, మధురైలో రూ.7713, మంగళూరులో రూ.7713, నాశిక్ లో రూ.7716, అయోధ్యలో రూ.7728, బళ్లారిలో రూ.7713, గురుగ్రాములో రూ.7728, నోయిడాలో రూ.7728గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7070గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7713 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7070గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7713 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1000 తగ్గి రూ.99,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
దేశంలో వరుస పండుగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావటంతో చాలా మంది ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు జనవరిలో రానున్న సంక్రాంతి కోసం కూడా చాలా మంది ఇప్పటి నుంచే గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిన్న భారీ ధరల పతనంతో ఆలస్యం చేయకుండా షాపింగ్ కి వెళ్లాలని చూస్తున్నారు. అలాంటి వారు ముందుగా నేటి రిటైల్ మార్కెట్లో ధరలను గమనించివెళ్లటం మంచిది.


Click it and Unblock the Notifications