Gold Rate: శుభవార్త.. శనివారం చల్లబడ్డ గోల్డ్, సిల్వర్.. వీకెండ్ షాపింగ్ తాజా రేట్లు ఇవే..
Gold Price Today: అమెరికా ఫెడ్ త్వరలో వడ్డీ రేట్ల తగ్గింపులకు వెళ్లనుందన్న సంకేతాలతో పసిడి ధరలు పరుగులు తీస్తున్నాయి. దీంతో గ్లోబల్ మార్కెట్లలో ఇటీవల గోల్డ్ తన ఆల్ టైమ్ గరిష్ఠ ధరలకు చేరుకుని అందరినీ బెంబేలెత్తిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ రేట్లు తిరిగి క్రమంగా తగ్గటంతో శ్రావణమాసం చివర్లో కొనుగోలుదారులు షాపులకు తిరిగి వెళుతున్నారు. బంగారం, వెండి ఆభరణాలను కొనేందుకు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాముల గోల్డ్ రేటు నిన్నటితో పోల్చితే రూ.1000 తగ్గుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన రేట్లను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.6695, ముంబైలో రూ.6695, దిల్లీలో రూ.6710, కలకత్తాలో రూ.6695, బెంగళూరులో రూ.6695, కేరళలో రూ.6695, వడోదరలో రూ.6700, జైపూరులో రూ.6719, మంగళూరులో రూ.6695, నాశిక్‌లో రూ.6698, అయోధ్యలో రూ.6710, బళ్లారిలో రూ.6695, గురుగ్రాములో రూ.6710, నోయిడాలో రూ.6710 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.1100 తగ్గుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో తగ్గిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7304, ముంబైలో రూ.7304, దిల్లీలో రూ.7319, కలకత్తాలో రూ.7304, బెంగళూరులో రూ.7304, కేరళలో రూ.7304, వడోదరలో రూ.7309, జైపూరులో రూ.7329, మంగళూరులో రూ.7304, నాశిక్‌లో రూ.7307, అయోధ్యలో రూ.7319, బళ్లారిలో రూ.7304, గురుగ్రాములో రూ.7319, నోయిడాలో రూ.7319గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6695గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7304 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1400 తగ్గి రూ.92,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications