Gold Price Today: చాలా కాలం తర్వాత ప్రస్తుతం పసిడి ధరలు భారీ తగ్గింపుతో నేల చూపులు చూస్తున్నాయి. దీంతో వారాంతంలో వరుసగా పడిపోయిన పసిడి ధరలు చాలా మంది భారతీయ కొనుగోలుదారులకు పెద్ద ఊరటను అందిస్తున్నాయి. ఆభరణాల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నవారికి ఇది సదవకాశంగా చెప్పొచ్చు.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు ఏకంగా రూ.3500 భారీ తగ్గింపును నమోదు చేసింది. ఇది నిన్నటి తగ్గింపు రూ.4500కు కొనసాగింపు. ఈ క్రమంలో నేడు దేశంలోని వివిధ నగరాల్లో తగ్గిన పసిడి ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.6840, ముంబైలో రూ.6780, దిల్లీలో రూ.6795, కలకత్తాలో రూ.6780, బెంగళూరులో రూ.6780, కేరళలో రూ.6780, వడోదరలో రూ.6785, జైపూరులో రూ.6795, లక్నోలో రూ.6795, నాశిక్ లో రూ.6783, అయోధ్యలో రూ.6795, బళ్లారిలో రూ.6780, గురుగ్రాములో రూ.6795, నోయిడాలో రూ.6795 వద్ద కొనసాగుతున్నాయి.

ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు ఇవాళ 100 గ్రాములకు రూ.3800 తగ్గగా.. నిన్న భారీగా రూ.4900 తగ్గింపును నమోదు చేసింది. ఈ క్రమంలో దేశంలోని ప్రముఖ నగరాల్లో తగ్గిన రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7462, ముంబైలో రూ.7397, దిల్లీలో రూ.7412, కలకత్తాలో రూ.7397, బెంగళూరులో రూ.7397, కేరళలో రూ.7397, వడోదరలో రూ.7402, జైపూరులో రూ.7412, లక్నోలో రూ.7412, నాశిక్ లో రూ.7400, అయోధ్యలో రూ.7412, బళ్లారిలో రూ.7397, గురుగ్రాములో రూ.7412, నోయిడాలో రూ.7412గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6780గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7397 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.100 తగ్గటంతో రూ.97,650 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications