Gold Price Today: వరుసగా మూడు రోజులుగా పసిడి ధరలు భారీ క్షీణతను నమోదు చేస్తున్నాయి. దీంతో దేశీయంగా పసిడి ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనేక నెలల పాటు భారీ ఒడిదొడుకులతో పెరిగిన ధరలు చల్లారటంతో చాలా మంది తమ ఆభరణాల కొనుగోళ్లను నేడు ప్లాన్ చేసుకుంటున్నారు. రానున్న పెళ్లిళ్ల సీజన్ కోసం ముందుగానే గోల్డ్ షాపింగ్ చేస్తున్నారు.
22 క్యారెట్ల పసిడి ధరలు 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.1000 తగ్గింపును నమోదు చేసింది. దీంతో వరుసగా మూడోరోజు సైతం గోల్డ్ రేట్లు కిందకు దిగివచ్చాయి. దేశంలోని వివిధ నగరాల్లో తగ్గిన పసిడి ధరలను పరిశీలిస్తే.. నేడు గ్రాముకు చెన్నైలో రూ.6825, ముంబైలో రూ.6770, దిల్లీలో రూ.6785, కలకత్తాలో రూ.6770, బెంగళూరులో రూ.6770, కేరళలో రూ.6770, వడోదరలో రూ.6775, జైపూరులో రూ.6785, లక్నోలో రూ.6785, నాశిక్ లో రూ.6773, అయోధ్యలో రూ.6785, గురుగ్రాములో రూ.6785, నోయిడాలో రూ.6785 వద్ద కొనసాగుతున్నాయి.

అలాగే 24 క్యారెట్ల గోల్డ్ రేటు నేడు 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.1200 తగ్గింపును నమోదు చేసింది. ఈ క్రమంలో మూడో రోజు దేశంలోని ప్రముఖ నగరాల్లో పరిశీలిస్తే గ్రాముకు.. చెన్నైలో రూ.7445, ముంబైలో రూ.7385, దిల్లీలో రూ.7400, కలకత్తాలో రూ.7385, బెంగళూరులో రూ.7385, కేరళలో రూ.7385, వడోదరలో రూ.7390, జైపూరులో రూ.7400, లక్నోలో రూ.7400, నాశిక్ లో రూ.7388, అయోధ్యలో రూ.7400, గురుగ్రాములో రూ.7400, నోయిడాలో రూ.7400గా కొనసాగుతున్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6770గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7382 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.96,000 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications