Gold Price Today: పసిడి రేట్లు తగ్గితే ఆభరణాల షాపింగ్ చేయాలనుకుంటున్న వారికి సరైన సమయం వచ్చేసింది. నేడు మార్కెట్లో గోల్డ్ ధరలు తగ్గుముఖం పట్టడంతో చాలా మంది షాపింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
స్థిరంగా తగ్గుతున్న పసిడి ధరల వేళ దేశంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు నిన్నటి కంటే రూ.200 తగ్గింది. దీంతో ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.55,050, ముంబైలో రూ.54,750, దిల్లీలో రూ.54,900, కలకత్తాలో రూ.54,750, బెంగళూరులో రూ.54,750, కేరళలో రూ.54,750, వడోదరలో రూ.54,800, పూణేలో రూ.54,750, జైపూర్ లో రూ.54,900, నాశిక్ లో రూ.54,780, మైసూరులో రూ.54,750, గురుగ్రామ్ లో రూ.54,900, నోయిడాలో రూ.54,900గా కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటి కంటే రూ.220 మేర తగ్గాయి. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో తగ్గిన నేటి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.60,050, ముంబైలో రూ.59,730, దిల్లీలో రూ.59,880, కలకత్తాలో రూ.59,730, బెంగళూరులో రూ.59,730, కేరళలో రూ.59,730, వడోదరలో రూ.59,780, పూణేలో రూ.59,730, జైపూర్ లో రూ.59,880, నాశిక్ లో రూ.59,760, మైసూరులో రూ.59,730, గురుగ్రామ్ లో రూ.59,880, నోయిడాలో రూ.59,880గా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని నగరాలైన విజయవాడ, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కాకినాడ, విశాఖపట్నం, గుంటూరు, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ.54,750గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.59,730గా కొనసాగుతోంది. ఇదే క్రమంలో వెండి ధరలను పరిశీలిస్తే.. కేజీకి రూ.1000 తగ్గి రూ.77,600 వద్ద రిటైల్ విక్రయాలను కొనసాగిస్తోంది.


Click it and Unblock the Notifications