Gold Price Today: కొంత కాలం కిందట అమాంతం ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు ప్రస్తుతం నేలచూపులు చూస్తున్నాయి. డిమాండ్ లేకపోవటంతో మార్కెట్లో ధరలు కళ తప్పి సామాన్యులకు అందుబాటులోకి వస్తున్నాయి.
22 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోల్చితే 10 గ్రాములకు రూ.300 మేర తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.55,500, ముంబైలో రూ.55,100, దిల్లీలో రూ.55,250, కలకత్తాలో రూ.55,100, బెంగళూరులో రూ.55,100, కేరళలో రూ.55,100, పూణేలో రూ.55,100, వడోదరలో రూ.55,150, జైపూర్‌లో రూ.55,250, చండీగడ్ లో రూ.55,250, నాశిక్ లో రూ.55,130 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల మేలిమి బంగారం ధరలు 10 గ్రాములకు రూ.330 మేర తగ్గాయి. తాజా రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను వివిధ ప్రాంతాల్లో పరిగణిస్తే.. చెన్నైలో రూ.60,550, ముంబైలో రూ.60,110, దిల్లీలో రూ.60,260, కలకత్తాలో రూ.60,110, బెంగళూరులో రూ.60,110, కేరళలో రూ.60,110, పూణేలో రూ.60,110, వడోదరలో రూ.60,160, జైపూర్‌లో రూ.60,260, చండీగడ్ లో రూ.60,260, నాశిక్ లో రూ.60,150 వద్ద ఉన్నాయి.
అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో నేటి రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. ముందుగా ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, అనంతపురంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,100గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,110 వద్ద విక్రయించబడుతోంది. తెలంగాణలోని నగరాల్లో సైతం ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.700 తగ్గి.. రూ.80,300 వద్ద విక్రయించబడుతోంది.


Click it and Unblock the Notifications