Gold Rate Today: రూ.1,100 తక్కువకు పసిడి విక్రయం.. AP, TS ఇవాళ్టి రేట్లివే..
Gold Rate Today: ప్రపంచ మార్కెట్లలో పరిస్థితులు కొంత కుదుటపడటంతో అనేక మంది ఇన్వెస్టర్లు బంగారాన్ని పక్కన పెడుతున్నారు. కొంత రిస్క్ తీసుకునేందుకు ముందుకు రావటంతో గోల్డ్ రేట్ల పతనం కొనసాగుతోంది.
ప్రస్తుతం బంగారం ధరల్లో కొనసాగుతున్న క్షీణత భారతీయ వినియోగదారులకు పండుగ సమయంలో బాగా కలిసొస్తోంది. దీపావళితో పాటు శుభకార్యాలు దగ్గర పడుతున్న వేళ నేడు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.100 తగ్గింది. దీంతో దేశవ్యాప్తంగా తగ్గిన పసిడి ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.56,700, ముంబైలో రూ.56,250, దిల్లీలో రూ.56,400, కలకత్తాలో రూ.56,250, బెంగళూరులో రూ.56,250, కేరళలో రూ.56,250, వడోదరలో రూ.56,300, జైపూరులో రూ.56,400, కోయంబత్తూరులో రూ.56,700, మంగళూరులో రూ.56,250, నాశిక్ లో రూ.56,280, మైసూరులో రూ.56,250, బళ్లారిలో రూ.56,250, నోయిడాలో రూ.56,400గా కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.80 తగ్గింది. దీంతో ప్రధాన నగరాల్లో నేటి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.61,850, ముంబైలో రూ.61,360, దిల్లీలో రూ.61,510, కలకత్తాలో రూ.61,360, బెంగళూరులో రూ.61,360, కేరళలో రూ.61,360, వడోదరలో రూ.61,410, జైపూరులో రూ.61,510, కోయంబత్తూరులో రూ.56,700, మంగళూరులో రూ.61,360, నాశిక్ లో రూ.61,390, మైసూరులో రూ.61,360, బళ్లారిలో రూ.61,360, నోయిడాలో రూ.61,510గా ఉన్నాయి.
ఏపీ తెలంగాణ నగరాలైన విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడ, విశాఖ, కడప, గుంటూరు, అనంతపురం, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.56,250గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,360 వద్ద కొనసాగుతోంది. ఇదే క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో వెండి కేజీ ధరను పరిశీలిస్తే నేడు రూ.700 తగ్గిన తర్వాత రిటైల్ విక్రయ ధర రూ.77,500గా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications