Gold Rate Today: దేశీయంగా బంగారం రిటైల్ ధరలు గతంలో ఎన్నడూ చూడని విధంగా నేడు కుప్పకూలాయి. ఈనెలలో ఇది భారీ ఒక్కరోజు తగ్గింపుగా చెప్పుకోవచ్చు. ఆభరణాల కొనుగోలు దారులకు ఇది నిజంగా అతిపెద్ద శుభవార్తగా చెప్పుకోవాలి.
గతవారం అందరి ద్రాక్షలా ఆకాశానికి ఎగిసిన పసిడి ధరలు నేడు అక్కడి నుంచి జారిపడ్డాయి. ఈ క్రమంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు నిన్నటితో పోల్చితే రూ.600 క్షీణించింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పరిశీలిస్తే.. చెన్నైలో రూ.54,100, ముంబైలో రూ.53,900, దిల్లీలో రూ.54,050, కలకత్తాలో రూ.53,900, కేరళలో రూ.53,900, వడోదరలో రూ.53,950, జైపూర్ లో రూ.54,050, కోయంబత్తూరులో రూ.54,100, మధురైలో రూ.54,100, సూరత్ లో రూ.53,950, నాశిక్ లో రూ.53,930, బళ్లారిలో రూ.53,900, గురుగ్రామ్ లో రూ.54,050, నోయిడాలో రూ.54,050 వద్ద రిటైల్ మార్కెట్లలో నేడు విక్రయాలు జరుగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములకు నిన్నటి కంటే రూ.650 తగ్గింది. దీంతో వివిధ ప్రధాన నగరాల రిటైల్ రేట్లను గమనిస్తే.. చెన్నైలో రూ.59,020, ముంబైలో రూ.58,800, దిల్లీలో రూ.58,950, కలకత్తాలో రూ.58,800, కేరళలో రూ.58,800, వడోదరలో రూ.58,850, జైపూర్ లో రూ.58,950, కోయంబత్తూరులో రూ.59,020, మధురైలో రూ.59,020, సూరత్ లో రూ.58,850, నాశిక్ లో రూ.58,830, బళ్లారిలో రూ.58,800, గురుగ్రామ్ లో రూ.58,950, నోయిడాలో రూ.58,950 వద్ద ఉన్నాయి.
ఏపీ, తెలంగాణ నగరాలైన విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కడప, తిరుపతి, విశాఖ, అనంతపురం, కాకినాడ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ లలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.53,900గా ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.58,800 వద్ద విక్రయించబడుతోంది. ఇదే క్రమంలో వెండి ధరలను పరిశీలిస్తే.. కేజీకి రూ.500 తగ్గి రూ.76,500గా కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications