Gold Price Today: దేశీయంగా పసిడి, వెండి ప్రియులకు బడ్జెట్ 2024 అతిపెద్ద బడ్జెట్ తాయిలాన్ని అందించింది. గతంలో వీటిపై దిగుమతి సుంకం 15 శాతంగా ఉండగా నిన్న నిర్మలా సీతారామన్ దానిని 9 శాతం తగ్గించి ప్రస్తుతం 6 శాతానికి పరిమితం చేయటంతో ధరలు దిగివచ్చాయి. దీంతో చాలా మంది షాపింగ్ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు.
దేశీయంగా పన్నులు తగ్గించిన తర్వాత నేడు 22 క్యారెట్ల పసిడి ధర గ్రాముకు వివిధ నగరాల్లో పరిశీలిస్తే.. చెన్నైలో రూ.6490, ముంబైలో రూ.6495, దిల్లీలో రూ.6510, కలకత్తాలో రూ.6495, బెంగళూరులో రూ.6495, కేరళలో రూ.6495, వడోదరలో రూ.6500, జైపూరులో రూ.6510, మంగళూరులో రూ.6495, నాశిక్ లో రూ.6498, అయోధ్యలో రూ.6510, గురుగ్రాములో రూ.6510, నోయిడాలో రూ.6510 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ తగ్గిన ధరలను పరిశీలిస్తే గ్రాముకు ప్రధాన నగరాల్లో.. చెన్నైలో రూ.7080, ముంబైలో రూ.7086, దిల్లీలో రూ.7101, కలకత్తాలో రూ.7086, బెంగళూరులో రూ.7086, కేరళలో రూ.7086, వడోదరలో రూ.7091, జైపూరులో రూ.7101, మంగళూరులో రూ.7086, నాశిక్ లో రూ.7089, అయోధ్యలో రూ.7101, గురుగ్రాములో రూ.7101, నోయిడాలో రూ.7101గా కొనసాగుతున్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6495గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7086 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.500 తగ్గి రూ.92,000 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications