e-Shram News: దేశంలో జనాభా వేగంగా పెరుగుదలతో పాటు అనేక కొత్త ఉపాధి అవకాశాలు కూడా వస్తున్నాయి. గతంలో మాదిరిగా ప్రభుత్వ ఉద్యోగాలు లేదా కొన్ని ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాల కంటే కూడా పార్ట్ టైమ్ పనిచేస్తున్న గిగ్ వర్కర్లు ప్రస్తుతం ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్న సంగతి తెలిసిందే.
నేటి కాలంలో జొమాటో, స్విగ్గీ, ఓలా, ర్యాపిడో సహా అనేక ఇతర డెలివరీ జాబ్స్ లేదా పార్ట్ టైమ్ ఆదాయం కోసం పనిచేసేవారిని గిగ్ వర్కర్లుగా పరిగణిస్తారు. వాస్తవానికి సదరు కంపెనీల్లో వీరు ఉద్యోగులుగా ఉన్నప్పటికీ రెగ్యులర్ ఉద్యోగులకు అందించే అనేక ప్రయోజనాలను వీరు పొందరు. ఇలాంటి ఉద్యోగుల సంక్షేమం, ఆరోగ్య భద్రతకు ప్రస్తుతం కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూచిస్తోంది. తద్వారా సదరు గిగ్ వర్కర్లు ఆయుష్మాన్ భారత్ పథకం ప్రయోజనాలను పొందగలరు.

ప్రస్తుతం దేశంలో గిగ్ కేటగిరీ కింద పనిచేస్తున్న శ్రామికశక్తి వ్యవస్థ విస్తరిస్తోందని కార్మిక మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. దీనికింద అద్దె ట్యాక్సీలు, వస్తువుల సరఫరా, లాజిస్టిక్స్, వృత్తిపరమైన సేవలు వంటి రంగాల్లో కొత్త ఉద్యోగాల సృష్టి కొనసాగుతోంది. దేశంలో గిగ్ ఎకానమీ 2024-25లో కోటి మందికి పైగా కార్మికులకు ఉపాధి కల్పిస్తుందని నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇది 2029-30 నాటికి 2.35 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేయబడింది. అందుకే ప్రభుత్వం కూడా పెరుగుతున్న ఈ ఆర్థిక వ్యవస్థకు మద్ధతునివ్వాలని నిర్ణయించింది.
ఈ పరిస్థితులకు అనుగుణంగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల తన వార్షిక బడ్జెట్ ప్రసంగంలో ఈ-శ్రమ్ పోర్టల్‌లో ప్లాట్‌ఫామ్ కార్మికుల ఆన్‌లైన్ నమోదు, గుర్తింపు కార్డుల జారీ, ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య సేవలను అందించడం వంటివి ప్రకటించబడ్డాయి. ఈ బడ్జెట్ నిబంధనలను అమలు చేయడానికి కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ త్వరలో ఒక స్కీమ్ ప్రారంభించనుంది. ఈ పథకం కింద వీలైనంత త్వరగా ప్రయోజనాలను పొందేందుకు వీలుగా ప్లాట్‌ఫామ్ కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్‌లో తమను తాము నమోదు చేసుకోవాలని సూచించింది.
ఆరోగ్య సంరక్షణతో పాటు ఈ గిగ్ వర్కర్లకు సైతం పెన్షన్ సౌకర్యాన్ని అందించే కొత్త స్కీమ్ తీసుకురావాటనికి కేంద్ర మంత్రివర్గ ఆమోదం కోసం ప్రతిపాదనను పంపినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భవిష్యత్తులో ఫుల్ టైం ఉద్యోగులకు ప్రస్తుతం అందుతున్న స్థాయిలోనే ప్రయోజనాలు గిగ్ వర్కర్లకు సైతం అందనున్నట్లు తెలుస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications