Adani Bribery Row: కొన్ని నెలల కిందట అదానీ తన వ్యాపారాల డీల్స్ కోసం భారతదేశంలో ప్రభుత్వ అధికారులకు పెద్ద మెుత్తంలో లంచాలు ఇచ్చినట్లు అమెరికా నుంచి వచ్చిన ఆరోపణలు పెద్ద ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే దీనికి వ్యతిరేకంగా ఆరుగురు కాంగ్రెస్ సభ్యులు అమెరికాలో రాసిన లేఖ గురించి వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఈ వ్యవహారంలో గౌతమ్ అదానీకి పెద్ద ఊరట లభించింది.
అమెరికాలో అదానీ గ్రూప్‌పై వచ్చిన లంచం ఆరోపణల కేసు దర్యాప్తును ప్రారంభించడానికి ఉపయోగించిన దాదాపు అర్ధ శతాబ్దం నాటి చట్టాన్ని నిలిపివేయాలని చేయాలని న్యాయ శాఖను ఆదేశిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేయటంతో గౌతమ్ అదానీకి పెద్ద ఊరట లభించింది. వాస్తవానికి వ్యాపారం పొందటం లేదా నిలుపుకోవటం కోసం విదేశీ ప్రభుత్వాల అధికారులకు లంచం ఇవ్వకుండా అమెరికన్ కంపెనీలు, విదేశీ సంస్థలు నిషేధించే 1977 విదేశీ అవినీతి పద్ధతుల చట్ట అమలు తాజా ట్రంప్ ఆర్డర్ తో నిలిచిపోనుంది. ఈ వార్త అదానీ లిస్టెడ్ కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లలో కొత్త జోష్ నింపుతోంది.

వాస్తవానికి గత ఏడాది గౌతమ్ అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీలపై ప్రభుత్వ అధికారులకు లంచం ఎరజూపి వ్యాపారాన్ని పొందారనే అభియోగం యూఎస్ సెక్యూరిటీ కౌన్సిల్ నవంబర్ 2024లో పేర్కొంది. వ్యాపారవేత్త అదానీ వేలకోట్ల విలువైన సోలార్ ప్రాజెక్టు కోసం అధికారులకు లంచాలు ఇచ్చినట్లు అందులో పేర్కొనబడింది. లాభదాయకమైన సోలార్ ఎనర్జీ సరఫరా కోసం భారత ప్రభుత్వ అధికారులకు రూ.2,029 కోట్లు లంచం ఇచ్చినందుకు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీతో సహా మరో ఆరుగురిపై న్యూయార్క్‌లోని యూఎస్ ప్రాసిక్యూటర్లు అభియోగం మోపిన సంగతి తెలిసిందే.
ఏపీలో ప్రకంపనలు..
ఈ వ్యవహారంలో ఏపీకి సంబంధం ఉన్నట్లు తేలింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(SECI) ద్వారా 7 గిగావాట్ల సోలార్ ఎనర్జీ కొనుగోలుకు అగ్రిమెంట్ జరిగింది. దీనిని పొందటానికి ముందు ఆగస్టు-నవంబర్ 2021లో మూడుసార్లు SECI, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల మధ్య విద్యుత్ సరఫరా ఒప్పందాన్ని అమలు చేయడానికి గౌతమ్ అదానీ వ్యక్తిగతంగా కలిసినట్లు కూడా వెల్లడించబడింది. అప్పట్లో అదానీపై వచ్చిన ఆరోపణలతో ఆయన లిస్టెడ్ కంపెనీ షేర్లు పతనం కావటంతో ఇన్వెస్టర్లు రూ.2 లక్షల కోట్లకు పైగా నష్టాలను చవిచూశారు.

ప్రస్తుతం ట్రంప్ ఆర్డర్ అమలులోకి రావటానికి దాదాపు 180 రోజులు సమయం పడుతుందని తెలుస్తోంది. అయితే ఈ కాలంలో కేసు విషయంలో కొత్త ఇన్వెస్టిగేషన్ లేదా చట్టపరమైన చర్యలు అదానీతో పాటు అభియోగాలు మోపబడినవారిపై ఉండబోవని తెలుస్తోంది. అయితే అదానీ గ్రూప్ ఈ ఆరోపణలను నిరాదారమైనవిగా గతంలోనే ఖండించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం అదానీకి అనుకూలంగా పరిణామాలు మారుతున్న వేళ ఆయన లిస్టెడ్ కంపెనీల షేర్లు క్రమంగా మార్కెట్ నష్టాల నుంచి తేలుకుంటున్నాయి. కొన్ని షేర్లు లాభాల్లో కూడా కొనసాగుతున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications