US visa: యూఎస్ వీసా కోసం అప్లై చేసినవారికి శుభవార్త..! హైదరాబాదులో..
Super Saturday: అమెరికా వెళ్లటం అనేది కొందరికి కోరిక అయితే చాలా మందికి ఇదొక జీవిత ఆశయం కూడా. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టేట్స్ వెళ్లాలనే కోరిక చాలా మంది యువతకు పెద్ద పిచ్చిలా ఉంటుంది. ఈ క్రమంలో వీసా రావాలని కోరుకుంటూ చాలా మంది చిలుకూరు బాలాజీకి మెుక్కులు కూడా మెక్కుతుంటారు. అలా ఆయన పేరు వీసా బాలాజీగా కూడా మన వాళ్లు మార్చేశారు.
అయితే అసలు విషయానికి వస్తే.. జనవరి 2024లో సూపర్ శనివారం పేరుతో యూఎస్ వీసా అప్లికెంట్ల కోసం కొత్త కార్యక్రమం ప్రవేశపెట్టబడింది. ఇందులో తొలిసారి వీసా కోసం అప్లై చేసుకునే వ్యక్తులకు వేగవంతంగా సేవలను అందించాలని, వెయిటింగ్ టైం తగ్గించాలనే లక్ష్యంతో తీసుకురాబడింది. దిల్లీలో ఉన్న యూఎస్ ఎంబసీ దాని ముంబై, కలకత్తా, హైదరాబాద్ కాన్సులేటర్లలో దీనికోసం శనివారం ఆఫీసులు తెరిచే ఉంటాయని స్పష్టం చేయబడింది. ఈ క్రమంలో గత శనివారం అంటే డిసెంబర్ 7, 2024న సూపర్ శనివారం నిర్వహించబడింది. దీని ద్వారా వీసా ఇంటర్వ్యూల నిర్వహణ సంఖ్యను పెంచటం ద్వారా రద్దీని తగ్గించాలని చూస్తున్నారు. రోజురోజుకూ అమెరికా వెళ్లాలనుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతున్న వేళ వినూత్నంగా ఈ చర్యను స్టార్ట్ చేశారు.

ఇలా ఇంటర్వ్యూలను పెంచటం వీసా కోసం వేటి ఉండే సమయం తగ్గటంతో పాటు అమెరికా-ఇండియా మధ్య ప్రయాణాన్ని సుగమం చేస్తుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ మునుపటి US వీసాలు ఉన్నవారికి ఇంటర్వ్యూ మినహాయింపు కేసుల కోసం రిమోట్ ప్రాసెసింగ్‌ను ప్రవేశపెట్టింది. అలాగే యూఎస్ రాయబార కార్యాలయం, కాన్సులేట్‌లకు కేటాయించిన కాన్సులర్ అధికారుల సంఖ్యను పెంచడం కూడా జరుగుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 10 లక్షల వీసా అప్లికేషన్లను ఇండియా వ్యాప్తంగా ప్రాసెసింగ్ చేసినట్లు మార్క్ మెక్‌గవర్న్, దిల్లీలోని యూఎస్ ఎంబసీలో కాన్సుల్ జనరల్ వెల్లడించారు.
విద్య, వ్యాపారం లేదా కుటుంబ సభ్యులను కలిసేందుకు అమెరికాకు వెళ్లే భారతీయులకు సేవలను అందించటం ద్వారా ప్రజల మధ్య బంధాన్ని బలపరుస్తున్నట్లు మార్క్ పేర్కొన్నారు. యూఎస్ మిషన్ టు ఇండియా చట్టబద్ధమైన ప్రయాణానికి ప్రాధాన్యతనిస్తూ, వేలాది వీసాలను ప్రాసెస్ చేస్తూ విద్యార్థులు, ఉపాధికి సంబంధించిన వలసదారులకు సహాయం చేసింది. ప్రస్తుతం ఇతర వీసా కేటగిరీల కోసం ఇంటర్వ్యూ నిరీక్షణ సమయాలు ప్రీ-పాండమిక్ స్థాయిలకు తిరిగి వయని, కొన్నిచోట్ల అంతకంటే తక్కువకు చేరుకున్నట్లు పేర్కొన్నారు.
యూఎస్ వీసాల కోసం విద్యార్థుల హడావిడి..
జనవరి 20న అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్న వేళ అమెరికాలోని యూనివర్సిటీలు అప్రమత్తం అయ్యాయి. 2017లో మెుదటి సారి ట్రంప్ గెలిచినప్పుడు ఎదురైన పరిస్థితుల దృష్యా తమ విదేశీ విద్యార్థులను ముందుగానే అప్రమత్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో విదేశాల్లో ఉన్న విద్యార్థులు ట్రంప్ అధ్యక్షుడిగా జనవరిలో బాధ్యతలు చేపట్టే సమయానికి భౌతికంగా అమెరికాలో ఉండాలని సూచిస్తున్నాయి. ఇదే క్రమంలో ఇతరదేశాల్లో ఉన్న తమ సిబ్బందికి కూడా ఇదే తరహా సూచనలు చేసాయి. ఈ క్రమంలో యేల్ యూనివర్శిటీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అండ్ స్కాలర్స్ ఆఫీస్ ఇటీవల ఇమ్మిగ్రేషన్ పాలసీ మార్పులపై ఉన్న ఆందోళనలను పరిష్కరించడానికి వెబినార్ కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications