Shrimp Insurance: రొయ్యల సాగు అనేక ఒడిదొడుకులతో కూడుకున్నది. ఇందులో సంపాందించిన వారి కంటే నష్టపోయిన వారు అధికంగా ఉన్నారని చెప్పుకోవటం అతిశయోక్తి కాదు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో రొయ్యల సాగు విరివిగా సాగుతోంది. చాలా మంది రైతులు తమ పొలాలలను రొయ్యల గుంటలుగా మార్చి ఇటీవల సాగు బాట పట్టారు. ఎక్కువగా ఎగువమతి చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ కూడా ఒకటిగా ఉంది. సాగు సజావుగా సాగితే రైతులు మంచి ఆదాయంతో పాటు భారీ లాభాలను సైతం ఇందులో పొందే అవకాశం ఎక్కువగా ఉంది.

దాదాపు మూడు దశాబ్దాల తర్వాత రొయ్యల పంట బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పునరుద్ధరించనుంది. దీనివల్ల లక్షలాది మంది తీరప్రాంత రొయ్యల రైతులకు ప్రయోజనం చేకూరనుంది. పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్యశాఖ సహాయ మంత్రి పర్షోత్తమ్ రూపాలా గురువారం గుజరాత్‌లో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేయనున్నారు. ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సాల్ట్ వాటర్ ఆక్వాకల్చర్ నుంచి సాంకేతిక సహాయంతో ప్రభుత్వం కోసం బీమా ఉత్పత్తిని క్యూరేట్ చేసింది. దీని ద్వారా రూ.1,000 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా.
1995-96 సమయంలో రొయ్య సాగులో వచ్చిన వైరల్ వ్యాధి కారణంగా ఓరియంటల్ ఇన్సూరెన్స్ తన బీమా పథకాన్ని అప్పట్లో నిలిపివేసింది. అప్పట్లో భారీ సంఖ్యలో రైతులు క్లెయిమ్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా సహాయక మంత్రి రూపాలా మరో ప్రభుత్వ రంగ బీమా కంపెనీ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ భాగస్వామ్యంపై కూడా ప్రకటన చేయెుచ్చని ఒక సీనియర్ అధికారి వెల్లడించారు.
ఈక్వెడార్ చైనాకు రొయ్యల ఎగుమతులలో భారతదేశం స్థానంలో నిలిచింది. గత దశాబ్దంలో భారత రొయ్యల ఉత్పత్తిలో 430 శాతం వృద్ధిని సాధించింది. ఎక్కువ వ్యాధులు, మరణాలు, నెమ్మదిగా పెరుగుదల వంటి అనేక కారణాలతో రొయ్యల పెంపకం ప్రమాదకర వెంచర్‌గా గుర్తించబడింది. అందుకే ఇందులో ఎక్కువ మంది చిన్న, సన్నకారు రైతులు ఉంటుంటారు. ఈ కారణాల వల్లనే బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు రొయ్యల సాగు విషయంలో జాగ్రత్తగా నడుచుకుంటుంటాయి.


Click it and Unblock the Notifications