Delta Corp: గేమింగ్, క్యాసినో వంటి వ్యాపారాలపై ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో జీఎస్టీ పన్ను రేట్లను సైతం భారీగా పెంచింది. ప్రస్తుతం ఈ రంగంలోని చాలా కంపెనీలు భారీ పన్ను నోటీసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.
క్యాసినో వ్యాపారంలో ఉన్న డెల్టాకార్ప్ సంస్థకు జారీ చేసిన రూ.16,195 కోట్ల GST నోటీసుపై ఎలాంటి తుది ఉత్తర్వులు జారీ చేయకుండా పన్ను అధికారులను బొంబాయి హైకోర్టు గోవా బెంచ్, హైదరాబాద్‌లోని జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ జనరల్‌ను ఆదేశించింది. కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉపశమనంతో Delta Corp Ltd షేర్ హోల్డర్లు పెద్ద ఊరటను అందుకున్నారు. గత నెలలో డెల్టాకార్ప్ తో పాటు అనుబంధ సంస్థలకు దాదాపు రూ.23,000 కోట్ల మేర పన్ను చెల్లింపుకు సంబంధించిన నోటీసులు అందాయి. ఇది కంపెనీ స్టేక్ హోల్డర్లలో పెద్ద సునామీని సృష్టించింది.

ముందస్తు అనుమతి లేకుండా రూ.16,195 కోట్ల పన్ను నోటీసుపై తుది ఉత్తర్వులు జారీ చేయరాదని బొంబాయి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనికి ముందు సోమవారం బీఎస్ఈలో కంపెనీ షేర్ ధర రూ.130 వద్ద ముగిసింది. అక్టోబర్ 23, 2023న కంపెనీ, దాని అనుబంధ సంస్థలు దాఖలు చేసిన రిట్ పిటిషన్లను గోవాలోని గౌరవనీయమైన బాంబే హైకోర్టు పరిగణించిందని కంపెనీ తన స్టాక్ మర్కెట్ ఫైలింగ్స్ లో వెల్లడించింది.
షోకాజ్ నోటీసుపై డిసెంబర్ 15, 2023లోగా సమాధానం ఇవ్వాలని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదించారు. ఈ క్రమంలో కోర్టు కేసును ఫిబ్రవరి 5, 2024న విచారించనుంది. ఇటీవల సిక్కిం హైకోర్టు డెల్టా కార్ప్‌కు రూ.628 కోట్ల జీఎస్‌టీ షోకాజ్ నోటీసు విషయంలో తదుపరి చర్యలు తీసుకోవద్దని డీజీజీఐని ఆదేశించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications