7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలం నుంచి తమ వేతన పెంపుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ కొత్తగా 8వ వేతన సంఘం ఏర్పాటు గురించి కీలక ప్రకటన చేసిన తర్వాత ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు హోలీ పండుగకు ముందే డియర్నెస్ అలవెన్స్, డియర్నెస్ రిలీఫ్ పొందవచ్చని తెలుస్తోంది.
ఇదే జరిగితే ఉద్యోగులు మార్చి 14, 2025 పండుగ మునుపై దీనికి సంబంధించిన కీలక ప్రకటనను ప్రభుత్వం నుంచి వినే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం దీనికి అంగీకారాన్ని తెలిపితే దాదాపు 1.2 కోట్ల మంది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. వాస్తవానికి ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు అందించే డీఏ, డీఆర్ జనవరితో పాటు జూలై నెలల్లో అంటే రెండుసార్లు సవరణలు చేపడుతుంది. అయితే ఈ సారి కూడా దీనికి సంబంధించి కీలక ప్రకటన కోసం ఉద్యోగులు వేచి చూస్తున్నారు.

ఇదే క్రమంలో ఏడాదిలో రెండవసారి రివిజన్ దీపావళి నాటికి ఉద్యోగులు అందుకుంటారని తెలుస్తోంది. మార్చి 5, 2025న దిల్లీలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో డీఏ పెంపుపై ఎటువంటి చర్చ జరగలేదు. చివరిగా డీఏ పెంపు జూలై 2024లో జరిగింది. ఆ సమయంలో డీఏను 50% నుంచి 53%కి పెంచారు. దీనికి ముందు కేంద్ర కేబినెట్ మార్చి 7, 2024న ఉద్యోగులకు డీఏను 46 శాతం నుంచి 50 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం 7వ వేతన సంఘం ప్రకారం అక్టోబర్ 16, 2024న డీఏ, డీఆర్ లను 3% పెంచింది. జూలై 1, 2024 నుండి అమలులోకి వచ్చేలా రెండింటినీ 53%కి అప్పట్లో పెంచింది.
ఇటీవల జనవరి 2025లో మోదీ ప్రభుత్వం 8వ వేతన సంఘం ప్రణాళికలను ప్రకటించింది. ఇది వచ్చే ఏడాది నాటికి అమలు చేయబడుతుందని భావిస్తున్నారు. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు జీతాలు, పెన్షన్లలో గణనీయమైన సవరణ కోసం ఆశాభావంతో ఉన్నారు. 8వ వేతన సంఘం అమలులోకి వచ్చిన తర్వాత ఉన్న భత్యాలను రద్దు చేసి, కొత్త భత్యాలను ప్రవేశపెట్టవచ్చని తెలుస్తోంది. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు గణనీయమైన ఆర్థిక లాభాలు చేకూరుతాయని కూడా నివేదికలు సూచిస్తున్నాయి.
8వ వేతన సంఘం కనీసం 2.57 లేదా అంతకంటే ఎక్కువ ఫిట్‌మెంట్ కారకాన్ని ఎందుకు JCM-NC కోరుతుందనే విషయాన్ని పరిశీలిస్తే.. ప్రభుత్వం ఫాలో అవుతున్న డాక్టర్ అక్రాయిడ్ సూత్రం చాలా పాతదని, ప్రస్తుతం ఉద్యోగుల అవసరాలను ప్రతిబింబించేలా కొలమానాలు లేవని శివ గోపాల్ మిశ్రా చెబుతున్నారు. 20వ శతాబ్దంలో అభివృద్ధి చేయబడిన డాక్టర్ అక్రాయిడ్ సూత్రం, నిత్యావసర వస్తువుల ధరలను పరిగణనలోకి తీసుకుంటుంది కానీ ఇంటర్నెట్ ఖర్చుల వంటి ఆధునిక ఖర్చులను పట్టించుకోదని ఉదహరించారు. ఉద్యోగులకు ప్రస్తుత కాలంలో గౌరవప్రదమైన జీవితాన్ని అందించటానికి పాత పద్దతులను మార్చాలని వారు చెబుతున్నారు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications