8th Pay Commission: ఇటీవల ప్రధాని మోదీ 8వ వేతన సంఘం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో దాదాపు కోటి మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు సంతోషంగా ఉన్నారు. వేతన సంఘం ఏర్పాటుతో తమ వేతనాలు ఎంత మేర పెరుగుతాయనే విషయం కోసం వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో లెవెల్ 1 నుంచి లెవెల్ 10 వరకు ఉన్న ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఏ ప్రాతిపధికన ప్రభుత్వం వేతన పెంపులను చేపడుతుందనే అనుమానం మనలో చాలా మందికి ఉంటుంది. దీనికి సమాధానం అక్రాయిడ్ ఫార్ములాలో ఉంది. కనీస జీవన వ్యయాన్ని అంచనా వేయడానికి డాక్టర్ వాలెస్ అక్రాయిడ్ రూపొందించిన పద్ధతిని కేంద్రం ఉపయోగిస్తోంది. వేతనాలు ప్రాథమిక అవసరాలైన ఆహారం, దుస్తులు, గృహనిర్మాణం వంటి ముఖ్యమైన ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటుంది. ఉద్యోగులకు న్యాయమైన వేతనాలను అందించటానికి భారతదేశం 1957లో అధికారికంగా ఈ సూత్రాన్ని అంగీకరించింది.

ప్రస్తుతం అమలులో ఉన్న 7వ వేతన సంఘం కూడా అక్రాయిడ్ ఫార్ములానే వేతనాల పెంపుల కోసం వినియోగించింది. దీని కారణంగా ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ వేతనం ఏకంగా రూ.7000 నుంచి రూ.18000లకు పెరిగింది. ద్రవ్యోల్పణానికి అనుగుణంగా దేశంలో ఉద్యోగుల వేతనాలను సవరించటానికి ఫార్ములా దోహదపడుతోంది. 8వ వేతన సంఘం కింద ప్రభుత్వం 1.92 - 2.86 మధ్య ఫిట్‌మెంట్ కారకాన్ని పరిశీలిస్తోందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇది ఉద్యోగుల వేతనాలు భారీగా పెరుగుదలకు దారితీస్తుంది.
2.86 ఫిట్మెంట్ అందస్తే ఉద్యోగి బేసిక్ శాలరీ ఏకంగా రూ.18000 నుంచి రూ.51,480కి చేరుకోనుంది. ఇక పెన్షనర్ల విషయానికి వస్తే కనీస పెన్షన్ రూ.9000 నుంచి రూ.25,740కి పెరుగుతుంది. పెరుగుతున్న జీవన వ్యయాలతో, ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు 8వ వేతన సంఘం వారి ఆర్థిక భవిష్యత్తును ఎలా రూపొందిస్తుందనే దానిపై నవీకరణల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే వాస్తవానికి ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ సమావేశంలో 8వ వేతన సంఘం ఏర్పాటుపై ఏదైనా ప్రకటన చేస్తారని ఉద్యోగులందరూ భావించారు. కానీ ఈ అంశంపై నిర్మలమ్మ నుంచి ఒక్క మాట కూడా రాకపోవటంతో 1.20 కోట్ల మంది ఉద్యోగులు, పెన్షనర్లు నిరాశకు గురయ్యారు. కానీ దీనికి కొన్ని రోజుల ముందుగానే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం కొత్త వేతన సంఘం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రకటించారు. ఈ పరిణామాలను చూస్తుంటే వేతన సంఘం ఏర్పాటు మరింతగా ఆలస్యం అవనున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications