Salary Hikes: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..! వేతన పెంపుల్లో క్లారిటీ, పూర్తి వివరాలు
8th Pay Commission: కరెక్టుగా దిల్లీ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ కీలక ప్రకటన చేశారు. అదే 8వ వేతన సంఘం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం. వాస్తవానికి ఇది ఉద్యోగులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రకటనే. కొత్తగా ఏర్పాటు చేసే వేతన సంఘం ఉద్యోగులకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ గురించి సమాచారం తెలియకపోవటంతో శాలరీ ఎంత పెరుగుతుందనే విషయంపై గందరగోళంగా ఉన్న సంగతి తెలిసిందే.
అయితే నిపుణులు చెబుతున్నదాని ప్రకారం కొత్త వేతన సంఘం అమలులోకి వచ్చిన తర్వాత ఉద్యోగి బేసిక్ శాలరీ 108 నుంచి 186 శాతానికి పెరుగుతుందని సమాచారం. దీని ప్రకారం వాస్తవంగా ఉద్యోగి శాలరీ 20-30 శాతం మధ్య పెంపును చూస్తుందని మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు కోటి మంది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ప్రభావితం అవుతారని తెలుస్తోంది. పెరుగుతున్న ధరల భారం నుంచి ప్రజలకు ఈ వేతన పెంపు కొంత ఉపశమనాన్ని అందిస్తుందని వారు చెబుతున్నారు.

ప్రస్తుతం అమలులో ఉన్న 7వ వేతన సంఘం గడువు ఈ ఏడాది చివరితో ముగిసిపోనుంది. అందుకే అందరి చూపు మోదీ ప్రకటించిన కొత్త వేతన సంఘంపై ఉంది. అయితే దీని ఏర్పాటు ఎంత తొందరగా జరుగుతుందనే దానిపై మాత్రం కొంత సందిగ్ధత కొనసాగుతోంది. 2016 సమయంతో పోల్చితే ద్రవ్యోల్బణం భారీగా పెరిగినందున ప్రస్తుతం కొత్తగా ఏర్పాటయ్యే వేతన సంఘం నిర్ణయంతో జీతాల పెంపు అధికంగా ఉండవచ్చని ఉద్యోగులు, పెన్షనర్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.92 నుంచి 2.08 వరకు పెంచేందుకు కేంద్రం అనుమతి ఇవ్వవచ్చని మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర వెల్లడించారు. అయితే మరికొందరు మాత్రం ఇది 2.86 వరకు ఉంటే అవశాతం ఉందని అంటున్నారు.
ఫిట్మెంట్ ఎంత పెరిగితే ఉద్యోగి వేతనం దానికి అనుగుణంగా అదే స్థాయిలో పెరుగుతుంటుంది. అందుకే ప్రభుత్వ ఉద్యోగులు ఎల్లప్పుడూ అధిక ఫిట్మెంట్ కోసం డిమాండ్ చేస్తుంటారు. ఉదాహరణకు 1.92 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ప్రకారం రూ.18,000 బేసిక్ శాలరీ ఉన్న ఉద్యోగి రూ.34,560 పొందుతారు. అలాగే 2.08 రేటు కింద వీరి జీతం 30 శాతం పెరిగి రూ.37,440కి చేరుకుంటుంది. అదే విధంగా ఊహాగానాల ప్రకారం 2.86 ఫిట్మెంట్ రేటును పరిగణలోకి తీసుకుంటే సదరు ఉద్యోగి 51,480 వేతనంగా అందుకునే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులను సంతోష పెట్టడానికి డీఏను దాదాపు 3-4 శాతం మధ్యలో పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.
2024లో కూడా 7వ వేతన సంఘం ఉద్యోగులకు మంచి ఉపశమనాన్ని అందించింది. రెండు దఫాలుగా ఉద్యోగులకు డీఏను 7 శాతం మేర పెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందుతున్న వేతనంలో దాదాపు 53 శాతం డీఆర్ అందుకుంటున్నారు. జూలై నుంచి డిసెంబర్ వరకూ ఉన్న ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా జనవరి 2025 డీఏ ఎంతనేది ఉంటుంది. జూలై-నవంబర్ 2024 మధ్య కాలంలో ఏఐసీపీఐ స్కోర్ 144.5 పాయింట్లకు డీఏ స్కోర్ 55.05 శాతానికి పెంచబడనుంది.


Click it and Unblock the Notifications