8th Pay commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. మోదీ సర్కార్ గ్రీన్ సిగ్నల్..
7th Pay Commission: 2025లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మంచి రోజులు వచ్చాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఉద్యోగుల కోసం 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వటంతో ఉద్యోగులు పండుగ చేసుకుంటున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం 8వ వేతన సంఘం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనివల్ల లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ పొందుతున్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారని తెలుస్తోంది. జనవరి 2016లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేసిన 7వ వేతన సంఘం సిఫార్సులు డిసెంబర్ 31, 2025న ముగియనున్న తరుణంలో తాజా పరిణామాలు వచ్చాయి. దీనికి ముందు ఏర్పాటు చేసిన వేతన సంఘాల విషయంలోనూ 10 ఏళ్ల కాలవ్యవధిని భారత ప్రభుత్వం అనుకరించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం దేశంలో ఉన్న కోటికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల విషయంలో వేతనాలు, అలవెన్సులతో పాటు ఇతర ప్రయోజనాల సవరించటం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ 2026 నాటికి కమిషన్‌ను ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1, 2025న జరగనున్న కేంద్ర బడ్జెట్ ప్రజెంటేషన్‌లో దీనికి సంబంధించిన ముఖ్యమైన పరిణామాలు వెల్లడి కావచ్చని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57 నుంచి 2.86కు పెంచే అవకాశం ఉందని, ఇది ఉద్యోగుల బేసిక్ వేతనాలపై గణనీయమైన ప్రభావం చూపుతుందని నివేదికలు చెబుతున్నాయి. గతంలోనూ 6వ వేతన సంఘం నుంచి 7వ వేతన సంఘానికి మారినప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నిర్మాణంలో గణనీయమైన పురోగతిని కనిపించింది. 7వ వేతన సంఘం కింద 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను అమలు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మూల వేతనం 2.57తో గుణించబడటంతో వారి ప్రాథమిక వేతనంలో 2.57 శాతం మేర పెరుగుదలకు కారణమైంది.
ప్రస్తుతం కొనసాగుతున్న 7వ వేతన సంఘం సిఫార్సులు 2016 నుంచి అమలు చేయబడుతున్నాయి. దీనికింద కనీస వేతనం రూ.18 వేల నుంచి గరిష్ఠంగా రూ.2.5 లక్షల వరకు అందించబడుతోంది. అలాగే ఉద్యోగులకు అందించే గ్రాట్యుటీ సీలింగ్ రూ.20 లక్షలుగా ఉంచగా, డీఐ ఆధారంగా కాలానుగుణంగా పెంచే సదుపాయాన్ని అందించింది.


Click it and Unblock the Notifications