DA Hike: కోటి మంది ఉద్యోగులకు శుభవార్త.. మార్చి 30 నుంచి పెరిగిన జీతాలు..!!
Salary Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి 30 తేదీ చాలా ప్రత్యేకమైనది. మార్చి నెల జీతం ఈ తేదీన వస్తుందని భావిస్తున్నారు. కేంద్ర ఉద్యోగులు తమ మార్చి జీతంలో పెరిగిన డియర్‌నెస్ అలవెన్స్(DA), ఇంటి అద్దె అలవెన్స్ అంటే HRA కూడా పొందనున్నట్లు సమాచారం.
వాస్తవానికి మార్చి 31 ఆదివారం. పైగా ఆర్థిక సంవత్సరానికి చివరి రోజు. అందువల్లనే ఉద్యోగులకు జీతాలను మార్చి 31కి బదులుగా ముందురోజే ఖాతాల్లోకి జమ అవుతాయి. అయితే మార్చి 31 ఆదివారం అయినప్పటికీ ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో బ్యాంకులు పని చేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ తదనుగుణంగా ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

కేంద్ర ఉద్యోగులకు కరువు భత్యాన్ని 4 శాతం పెంచడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ పెంపు వల్ల గతంలోని 46 శాతం నుంచి 50 శాతానికి భత్యం పెంచబడింది. ఇది గత జనవరి నుంచి అమల్లోకి రానుంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ఉద్యోగులకు జనవరి, ఫిబ్రవరి నెలల బకాయిలు కూడా వస్తాయి. డీఏ 50 శాతానికి చేరుకోవడంతో ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఏ)లో కూడా అదే స్థాయిలో పెరుగుదల కనిపించింది. నగర వర్గీకరణను బట్టి ఉద్యోగులు 30 శాతం వరకు HRA పొందుతారు.
అంతే కాకుండా డీఏ పెంపుతో కేంద్ర ఉద్యోగులకు వివిధ రకాల అలవెన్సులు కూడా పెరిగాయి. వీటిలో పిల్లల సంరక్షణ, పిల్లల విద్య వంటి అలవెన్సులు ఉన్నాయి. అయితే ఉద్యోగులు ఈ అలవెన్సులను క్లెయిమ్ చేసుకోవాలి. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. లేబర్ బ్యూరో ప్రతి నెలా విడుదల చేసే తాజా వినియోగదారుల ధరల సూచిక (CPI-IW) ఆధారంగా ఉద్యోగులు, పెన్షనర్‌లకు డియర్‌నెస్ అలవెన్స్(DA) నిర్ణయించబడుతుందని తెలిసిందే.


Click it and Unblock the Notifications