Byju's News: కరోనా మహమ్మారి ఎక్కువ కాలం పీడించిన సమయంలో డిజిటల్ ఎడ్యుకేషనల్ ఫ్లాట్ ఫారమ్ లకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. దీనిని అందిపుచ్చుకోవాలని ప్రయత్నించిన జైజూస్ భారీగా పెట్టుబడులను పెట్టి విస్తరణ బాట పట్టింది.
కానీ పరిస్థితులు చక్కబడ్డాక అందరూ ఫిజికల్ స్కూలింగ్ ప్రాముఖ్యతను గుర్తించి తిరిగి పిల్లలను స్కూళ్లకు తిరిగి పంపటం ప్రారంభించారు. దీంతో బైజూస్ భారీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఈ క్రమంలో 250 మిలియన్ డాలర్లను సమీకరించడానికి మార్చిలో డేవిడ్‌సన్ కెంప్‌నర్‌తో బైజు ఒప్పందంపై సంతకం చేసింది. ఇందులో మొదటి విడత 100 మిలియన్ డాలర్లను బైజూస్ అందుకుంది. కానీ వివాదం తలెత్తిన తర్వాత మిగిలిన మెుత్తం రావటం ఆగిపోయింది.

తాజాగా ఈ 100 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీ ప్రకారం సుమారు రూ.800 కోట్ల రుణాన్ని మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్ చైర్మన్ రంజన్ పాయ్ బైజూస్ డేవిడ్‌సన్ కెంప్నర్ నుంచి కొనుగోలు చేసింది. ఇది నిజంగా బైజూస్ సంస్థకు ప్రస్తుత సమయంలో అతిపెద్ద శుభవార్తని చెప్పుకోవాలి. ఇందుకోసం ఏకంగా రూ.1,400 కోట్లను రంజన్ పాయ్ వెచ్చించారు. సెటిల్‌మెంట్‌లో రుణానికి అదనంగా డేవిడ్‌సన్ కెంప్‌నర్ క్లెయిమ్ చేసిన శిక్షాత్మక మొత్తం కూడా ఉంటుంది.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రంజన్ పాయ్ కుటుంబ కార్యాలయం ఆకాష్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ లిమిటెడ్ (AESL)లో డేవిడ్‌సన్ కెంప్‌నర్ క్రెడిట్ ఎక్స్‌పోజర్‌ను పొందింది. తాజా చర్యల కారణంగా.. బైజూ-డేవిడ్‌సన్ కెంప్‌నర్‌ల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదానికి పాయ్ పెట్టుబడితో తెరపడింది. బైజూస్ సంస్థ రుణదాతలకు వాయిదాలను చెల్లించకపోవటం వల్లనే వివాదం మెుదలైంది. మెుత్తానికి శుక్రవారంతో లావాదేవీ పూర్తయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.


Click it and Unblock the Notifications