అబ్బా... దిగొస్తున్న బంగారం ధరలు... కొనేందుకు మంచి ఛాన్స్.. ఇవాళ్టి రేట్లు ఇవే..
Gold Price Today: మన దేశంలో మహిళలకు బంగారం ఇంకా బంగారు ఆభరణాల షాపింగ్ అంటే చాల ఇష్టపడుతుంటారు. అలాగే పసిడి ధరలు కొంతకాలంగా పడిపోతూ పెరిగిపోతూ వస్తున్నాయి. ఇక ఇవాళ మాత్రం బంగారం ధర కాస్త దిగొచ్చాయి. దింతో బంగారం కొనుగోలుదారులకు ఊరట లభించింది. మరోవైపు కొత్త ఏడాది, సంక్రాంతి పండగ దగ్గరపడుతున్న సమయంలో చాలా మంది ధరలు తగ్గింపు పై ఎదురు చుస్తున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 10 గ్రాములకు రూ.2500 తగ్గింది. దీంతో వివిధ నగరాల్లో తగ్గిన పసిడి ధరలు చూస్తే.. 1 గ్రాముకు చెన్నైలో రూ.7,115, ముంబైలో రూ.7,115, దిల్లీలో రూ.7130, కలకత్తాలో రూ.7115, బెంగళూరులో రూ.7115, కేరళలో రూ.7115, పూణేలో రూ.7115, వడోదరలో రూ.7120, అహ్మదాబాదులో రూ.7120, జైపూరులో రూ.7130, లక్నోలో రూ.7130, కోయంబత్తూరులో రూ.7115గా కొనసాగుతున్నాయి. ఇక్కడ పేర్కొనబడిన ధరలు జీఎస్టీ, తరుగు, మజూరి లేదా ఇతర వ్యాపారి లాభాలు కలపక ముందు రేట్లని అందరూ గమనించాలి.

అలాగే 24 క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటితో పోల్చితే 10 గ్రాములకు రూ.2700 తగ్గుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో 1 గ్రాముకు చెన్నైలో రూ.7762, ముంబైలో రూ.7762, దిల్లీలో రూ.7777, కలకత్తాలో రూ.7762, బెంగళూరులో రూ.7762, కేరళలో రూ.7762, పూణేలో రూ.7762, వడోదరలో రూ.7767, అహ్మదాబాదులో రూ.7767, జైపూరులో రూ.7777, లక్నోలో రూ.7777, కోయంబత్తూరులో రూ.7762 ఇలా అమ్మకాలు జరుగుతున్నాయి.
ఏపీ-తెలంగాణలో చూస్తే హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర గ్రాముకు రూ.7115గా ఉండగా.. 24 క్యారెట్ల ధర గ్రాముకు రూ.7762 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో పరిశీలిస్తే గ్రాము వెండి ధర గ్రాముకు రూ.92 కాగా కేజీకి రూ.92,000.


Click it and Unblock the Notifications