Gold Price Today: గతవారం భారీ ర్యాలీని కొనసాగించిన పసిడి ధరలు కొత్త వారంలో ప్రజలకు స్వల్ప ఊరటను కల్పిస్తున్నాయి. సోమవారం బక్రీద్ పండుగ వేళ గోల్డ్ రేటు తగ్గటంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అనేక మంది తమ షాపింగ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే ఏకంగా రూ.2000 పతనాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో రిటైల్ తగ్గిన విక్రయ ధరలను పరిశీలిస్తే గ్రాముకు.. చెన్నైలో రూ.6690, ముంబైలో రూ.6630, దిల్లీలో రూ.6645, కలకత్తాలో రూ.6630, బెంగళూరులో రూ.6630, కేరళలో రూ.6630, జైపూరులో రూ.6645, లక్నోలో రూ.6645, నాశిక్ లో రూ.6633, మంగళూరులో రూ.6630, అయోధ్యలో రూ.6645, గురుగ్రాములో రూ.6645, నోయిడాలో రూ.6645 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు 100 గ్రాములకు ధర నిన్నటితో పోల్చితే రూ.2200 క్షీణతను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో రిటైల్ తగ్గిన విక్రయ ధరలను పరిశీలిస్తే గ్రాముకు.. చెన్నైలో రూ.7298, ముంబైలో రూ.7233, దిల్లీలో రూ.7248, కలకత్తాలో రూ.7233, బెంగళూరులో రూ.7233, కేరళలో రూ.7233, జైపూరులో రూ.7248, లక్నోలో రూ.7248, నాశిక్ లో రూ.7238, మంగళూరులో రూ.7233, అయోధ్యలో రూ.7248, గురుగ్రాములో రూ.7248, నోయిడాలో రూ.7248గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6,630గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7,233 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.95,600 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications