Gold Rate Today: దేశంలో బంగారం ధరలు గడచిన మూడు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. వాస్తవానికి ఇది కొనుగోలుదారులకు సరైన కొనుగోలు సమయంగా చెప్పుకోవచ్చు. పెళ్లిళ్ల సీజన్ మెుదలవుతున్న వేళ గోల్డ్ షాపింగ్ చేసేవారికి ఇదొక సదవకాశం.
22 క్యారెట్ల పసిడి ధరలను దేశంలోని ప్రముఖ నగరాల్లో పరిశీలిస్తే.. చెన్నైలో రూ.58,300, దిల్లీలో రూ.57,950, ముంబైలో రూ.57,800, బెంగళూరులో రూ.57,800, వడోదరలో రూ.57,850, జైపూరులో రూ.57,950, మంగళూరులో రూ.57,800, నాశిక్ లో రూ.57,830, మైసూరులో రూ.57,800, అయోధ్యలో రూ.57,950, నోయిడాలో రూ.57,950, బళ్లారిలో రూ.57,800, గురుగ్రామ్ లో రూ.57,950గా కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేట్లను దేశంలోని వివిధ ప్రాంతాల్లో గమనిస్తే.. చెన్నైలో రూ.63,600, దిల్లీలో రూ.63,200, ముంబైలో రూ.63,050, బెంగళూరులో రూ.63,050, వడోదరలో రూ.63,100, జైపూరులో రూ.63,200, మంగళూరులో రూ.63,050, నాశిక్ లో రూ.63,080, మైసూరులో రూ.63,050, అయోధ్యలో రూ.63,200, నోయిడాలో రూ.63,200, బళ్లారిలో రూ.63,050, గురుగ్రామ్ లో రూ.63,200గా ఉన్నాయి.
ఏపీ, తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కడప, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, అనంతపురం, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి ధర రూ.57,800గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.63,050గా కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర కేజీ రూ.77,000గా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications