Gold Rate: రెండోరోజు కుప్పకూలిన గోల్డ్ రేటు.. నేడు రూ.2200 పడిన ధరలివే..
Gold Price Today: అమెరికా ఫెడ్ రేట్ల తగ్గింపు ఊహాగానాలతో పెరిగిన గోల్డ్ సిల్వర్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో శ్రావణమాసంలో శుభకార్యాలు జరుగుతున్న వేళ ప్రజలు విరివిగా పసిడి, వెండి కొనుగోళ్లను కొనసాగిస్తున్నారు. షాపింగ్ చేసేముందు తప్పక రిటైల్ విక్రయ ధరలను అందరూ తెలుసుకోవటం ముఖ్యం.
22 క్యారెట్ల పసిడి ధరలు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.2000 తగ్గింపును నమోదు చేశాయి. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో తగ్గిన రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.6660, ముంబైలో రూ.6660, దిల్లీలో రూ.6675, కలకత్తాలో రూ.6660, బెంగళూరులో రూ.6660, కేరళలో రూ.6660, వడోదరలో రూ.6665, జైపూరులో రూ.6675, మంగళూరులో రూ.6660, నాశిక్ లో రూ.6663, అయోధ్యలో రూ.6675, బళ్లారిలో రూ.6660, గురుగ్రాములో రూ.6675, నోయిడాలో రూ.6675 వద్ద నేడు కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.2200 తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో తగ్గిన విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7265, ముంబైలో రూ.7265, దిల్లీలో రూ.7280, కలకత్తాలో రూ.7265, బెంగళూరులో రూ.7265, కేరళలో రూ.7265, వడోదరలో రూ.7270, జైపూరులో రూ.7280, మంగళూరులో రూ.7265, నాశిక్ లో రూ.7268, అయోధ్యలో రూ.7280, బళ్లారిలో రూ.7265, గురుగ్రాములో రూ.7280, నోయిడాలో రూ.7280గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6660గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7265 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.300 తగ్గి రూ.91,700 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications