Gold Price Today: బంగారం ధరలు ప్రస్తుతం చల్లబడుతున్నాయి. రానున్న కాలంలో మళ్లీ ద్రవ్య విధానాన్ని టైట్ చేయవచ్చని యూఎస్ ఫెడరల్ రిజర్వ్ అధికారి చేసిన కామెంట్స్ డాలర్ బలాన్ని పెంచింది. దీంతో నేడు గోల్డ్ రేట్లు పడిపోయాయి. ఇదే క్రమంలో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ మిన్నియాపాలిస్ ప్రెసిడెంట్ నీల్ కష్కరీ ప్రస్తుత వడ్డీ రేట్లను పొడిగించిన కాలానికి కొనసాగించాలని సూచించారు. దీంతో అధిక వడ్డీ రేట్లు, బలమైన డాలర్ రెండూ సాధారణంగా బంగారం ధరలను తగ్గిస్తాయి.
తాజా పరిణామాలతో దేశీయంగా పసిడి ధరలు నిన్నటితో పోల్చితే 22 క్యారెట్ల 100 గ్రాముల పసిడి ధర రూ.1000 తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో తగ్గిన పసిడి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.66,300, ముంబైలో రూ.66,250, దిల్లీలో రూ.66,400, కలకత్తాలో రూ.66,250, బెంగళూరులో రూ.66,250, కేరళలో రూ.66,250, వడోదరలో రూ.66,300, జైపూరులో రూ.66,400, నాశిక్ లోరూ.66,280, మంగళూరులో రూ.66,250, అయోధ్యలో రూ.66,400, బళ్లారిలో రూ.66,250, గురుగ్రాములో రూ.66,400, నోయిడాలో రూ.66,400 వద్ద విక్రయించబడుతున్నాయి.

ఇదే క్రమంలో నేడు 24 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.1,100 తగ్గుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి రిటైల్ పసిడి విక్రయ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.72,330, ముంబైలో రూ.72,270, దిల్లీలో రూ.72,420, కలకత్తాలో రూ.72,270, బెంగళూరులో రూ.72,270, కేరళలో రూ.72,270, వడోదరలో రూ.72,320, జైపూరులో రూ.72,420, నాశిక్ లోరూ.72,300, మంగళూరులో రూ.72,270, అయోధ్యలో రూ.72,420, బళ్లారిలో రూ.72,270, గురుగ్రాములో రూ.72,420, నోయిడాలో రూ.72,420గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.66,250గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,270 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు స్థిరంగా రూ.88,500 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications