Gold: గోల్డ్ రేటు తులం రూ.10,000 తగ్గనుంది.. అప్పటి వరకు ఆగాల్సిందే.. క్యాష్ రెడీ చేస్కోండి
Gold Rate: దేశీయంగా పసిడి ధరలు ఇప్పటికీ మండిపోతూనే ఉన్నాయి. గతవారం తగ్గినట్టే తగ్గిన రేట్లు ఈవారం తిరిగి పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది అసలు ప్రస్తుత ధరల వద్ద కొనుక్కోవాలా లేక ఇంకా కొన్ని రోజులు ఆగితే బెటరా అనే అయోమయంలో కొనసాగుతున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం షాపింగ్ చేయాల్సిన వాళ్లు తప్పక షాపింగ్ చేస్తుండగా, పెట్టుబడి కోసమో లేదా మామూలుగా షాపింగ్ చేయాలనుకునే వారికి మాత్రం ఇప్పుడొక పెద్ద శుభవార్త ఉంది.
అవును నిపుణుల అంచనా ప్రకారం కొత్త ఏడాదిలో ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. జనవరి 2025 నుంచి పసిడి రేట్లు భారీగా తగ్గనున్నట్లు వారు అంచనా వేస్తున్నారు. ధరలు తగ్గుతాయనే అంచనాలకు అసలు కారణం అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ వైట్ హౌస్ పగ్గాలు జనవరి 20 నుంచి చేపట్టడమే. అమెరికా ఆర్థిక వ్యవస్థను స్థిరపరచటంతో పాటు యూఎస్ ఆర్థిక వ్యవస్థను ప్రొటెక్ట్ చేసే విధంగా పాలసీలను రూపొందిస్తారని నిపుణులు భావిస్తున్నారు. దీనికి ముందు చాలా మంది నిపుణులు అతి త్వరలోనే గోల్డ్ రేట్లు 10 గ్రాములకు ఏకంగా లక్ష రూపాయలను తాకుతాయని అంచనా వేశారు. కానీ ఎప్పుడైతే ట్రంప్ గెలుపొందారో వరుసగా బంగారం రేట్లలో పతనం స్టార్ట్ అవటం మనం ధరల్లో గమనించవచ్చు.

ఈ ఏడాది మోదీ సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జూలైలో ఫుల్ టైమ్ వార్షిక బడ్జెట్ సమయంలో దిగుమతి సుంకాన్ని భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో 10 గ్రాముల ఫ్యూర్ గోల్డ్ ధర రూ.67 వేల స్థాయికి దిగజారింది. కానీ ఆ తర్వాత అనేక అంతర్జాతీయ ఉద్రిక్తతలతో తిరిగి పసిడి దూకుడు కొనసాగించి రూ.80 వేల మార్కును అధిగమనించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం గోల్డ్ ధరలు రూ.77 వేల స్థాయిలో కొనసాగుతున్నాయి. కానీ ఇప్పుడు ట్రంప్ ఆర్థిక విధానాలతో పరిస్థితులు జనవరి నుంచి పూర్తిగా మారతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే క్రమంలో నిన్న అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఛైర్ జెరోమ్ పావెల్ అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని పేర్కొనటం ఇన్వెస్టర్లు దూకుడుగా ముందుకు సాగటానికి ప్రోత్సహించవచ్చని తెలుస్తోంది. దీంతో ప్రజలు సేఫ్ హెవెన్ బంగారం నుంచి బాండ్ మార్కెట్లు, ఈక్వీటీ మార్కెట్లలోకి తమ డబ్బును తీసుకొస్తారని తెలుస్తోంది.
ఈ క్రమంలో తులం బంగారం ధరలు జనవరి నుంచి ప్రస్తుత స్థాయిల నుంచి మరో రూ.10 వేలు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు అగ్రరాజ్యం అమెరికాను పారిశ్రామికంగా తిరిగి బలపరిచేందుకు ట్రంప్ చేపట్టనున్న వేళ తిరిగి ప్రపంచవ్యాప్తంగా యూఎస్ కంపెనీల లాబియింగ్ తిరిగి పుంజుకుంటుందని చాలా మంది భావిస్తున్నారు. ఇదే క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులను ఆపేందుకు సైతం ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు కేడియా కమోడిటీస్ డైరెక్టర్ అజయ్ కేడియా అన్నారు. ఈ క్రమంలోనే అందరి చూపు రాబోయే ఫెడ్ సమావేశంలో వడ్డీ రేట్ల తగ్గింపు ఎంతవరకు ఉంటుందనే అంశంపై దృష్టిని కొనసాగిస్తున్నారు.


Click it and Unblock the Notifications