Gold Rate: దిగొచ్చిన గోల్డ్ రేటు.. సోమవారం రూ.1600 తగ్గిన పసిడి ధర, ఏపీ-తెలంగాణలో..
Gold Price Today: దేశీయంగా గడచిన పది రోజులుగా గోల్డ్ రేట్లు హీట్ పుట్టించాయి. దూకుడుగా పెరిగిన రేట్లు మధ్య తరగతి నుంచి ధనవంతుల వరకు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. జీవితంలో పసిడి కొనగలమా అనే స్థాయిలో ఫెడ్ రేట్ల తగ్గింపు తర్వాత రేట్లు పెరగటంతో కొనుగోళ్లు సైతం తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. అయితే నెల చివరిలో మాత్రం స్వల్పంగా ధరలు దిగిరావటం దేశీయ వినియోగదారులకు సంతోషాన్ని కలిగిస్తోంది.
22 క్యారెట్ల గోల్డ్ రేటు 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.1500 తగ్గింపును చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7080, ముంబైలో రూ.7080, దిల్లీలో రూ.7095, కలకత్తాలో రూ.7080, బెంగళూరులో రూ.7080, కేరళలో రూ.7080, వడోదరలో రూ.7085, జైపూరులో రూ.7095, మంగళూరులో రూ.7080, నాశిక్ లో రూ.7097, అయోధ్యలో రూ.7095, బళ్లారిలో రూ.7080, గురుగ్రాములో రూ.7095, నోయిడాలో రూ.7095 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. అయితే పైన పేర్కొన్న ధరలు జీఎస్టీ, విక్రయదారును లాభాలు ఇతర ఛార్జీలు కలపకు ముందు రేట్లు మాత్రమే.

ఇదే క్రమంలో 24 క్యారెట్లో పసిడి ధర 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.1600 తగ్గుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో తగ్గిన రిటైల్ విక్రయ ధరలను గ్రాముకు నేడు పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7724, ముంబైలో రూ.7724, దిల్లీలో రూ.7739, కలకత్తాలో రూ.7724, బెంగళూరులో రూ.7724, కేరళలో రూ.7724, వడోదరలో రూ.7729, జైపూరులో రూ.7739, మంగళూరులో రూ.7724, నాశిక్ లో రూ.7727, అయోధ్యలో రూ.7739, బళ్లారిలో రూ.7724, గురుగ్రాములో రూ.7739, నోయిడాలో రూ.7739 వద్ద కొనసాగుతున్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7080గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7724 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.100 తగ్గి రూ.1,00,900 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం ఆర్థిక ఆరోగ్యం, స్థిరత్వాన్ని కొనసాగించే క్రమంలో.. గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల పసిడి కొనుగోళ్లు ధరల పెరుగుదల చూసిన తర్వాత తిరిగి క్రమంగా తగ్గుదలను చూస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పసిడి డిమాండ్ పెరగడం, ముఖ్యంగా ఆర్థిక అస్థిరతలు లేదా మునుపటి కంటే ఎక్కువ రిస్క్ ఉన్న సమయంలో ధరలను ప్రభావితం చేస్తుంది. కేంద్ర బ్యాంకులు తమ ఆర్థిక విధానాలను సానుకూలంగా మార్చినప్పుడు, గోల్డ్ హోల్డింగ్స్ ఎక్కువగా ఉండటాన్ని భద్రతగా భావించి, భారీగా కొత్త నిల్వలు పెంచుతుంటాయి. అయితే మెగా ర్యాలీ తర్వాత గోల్డ్ రేట్లు నెల చివరి రోజున స్వల్ప తగ్గుదలను చూస్తున్నాయి.


Click it and Unblock the Notifications