Gold Price Today: మరికొద్ది రోజుల్లో వినాయక చతుర్థితో పండుగల సీజన్ ప్రారంభం అవుతోంది. ఈ క్రమంలో బంగారం ధరల్లో పతనం సామాన్యుల్లో ఆశలు చిగురింపజేస్తోంది. చాలా మంది పసిడి కొనుగోలుకు ప్లాన్ చేసుకుంటున్నారు.
22 క్యారెట్ల పసిడి ధరలు నిన్నటి కంటే 10 గ్రాములకు రూ.340 మేర తగ్గింది. రేట్ల వరుస పతనంతో దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో తాజా రిటైల్ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.54,800, ముంబైలో రూ.54,500, దిల్లీలో రూ.54,650, కలకత్తాలో రూ.54,500, బెంగళూరులో రూ.54,500, కేరళలో రూ.54,500, పూణేలో రూ.54,500, వడోదరలో రూ.54,550, అహ్మదాబాదులో రూ.54,550, జైపూర్ లో రూ.54,650, లక్నోలో రూ.54,650, కోయంబత్తూరులో రూ.54,800, నాశిక్ లో రూ.54,530 చొప్పున విక్రయాలు జరుగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి కంటే 10 గ్రాములకు రూ.380 పడిపోయింది. దీంతో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిగణిస్తే.. చెన్నైలో రూ.59,780, ముంబైలో రూ.59,450, దిల్లీలో రూ.59,600, కలకత్తాలో రూ.59,450, బెంగళూరులో రూ.59,450, కేరళలో రూ.59,450, పూణేలో రూ.59,450, వడోదరలో రూ.59,500, అహ్మదాబాదులో రూ.59,500, జైపూర్ లో రూ.59,600, లక్నోలో రూ.59,600, కోయంబత్తూరులో రూ.59,780, నాశిక్ లో రూ.59,480 వద్ద కొనసాగుతున్నాయి.
ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విజయవాడ, నెల్లూరు, తిరుపతి, విశాఖ, కాకినాడ, అనంతపురం, గుంటూరు, హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, కరీంనగర్ లలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.54,500గా విక్రయిస్తుండగా.. 24 క్యారెట్ల పసిడి ధర 59,450 చొప్పున కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధరలను పరిశీలిస్తే.. కిలోకు రూ.1,000 తగ్గటంతో తెలుగు రాష్ట్రాల్లో ధర రూ.77,000గా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications