Gold Rate: శుభవార్త.. నేలకు కుప్పకూలిన పసిడి ధర.. ఒక్కరోజే రూ.8,700 పతనం..

Gold Price Today: శుక్రవారం భారీగా పసిడి ధరలు పెరిగిన తర్వాత.. వారాంతంలో పసిడి ధరలు భారీ క్షీణతను చూశాయి. గడచిన వారం రోజులుగా వరుసగా పెరుగుతున్న గోల్డ్ రేట్లు నేడు తగ్గటం భారతీయ పసిడి ప్రియుల్లో జోష్ నింపుతోంది. వాస్తవానికి వీకెండ్ షాపింగ్ కోసం వెల్లటానికి ముందు ధరలు తగ్గటంపై చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ దగ్గరపడుతున్న వేళ ఆభరణాల కొనుగోలుకు చాలా మంది ప్లాన్ చేస్తున్న తరుణంలో ధరల పతనం వచ్చింది.

శనివారం అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా పసిడి ధరలు తగ్గటంతో 22 క్యారెట్ల గోల్డ్ 100 గ్రాముల రేటు నిన్నటితో పోల్చితే రూ.8000 భారీ పతనాన్ని చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ పసిడి ధరలను గమనిస్తే గ్రాముకు.. చెన్నైలో రూ.6695, ముంబైలో రూ.6635, దిల్లీలో రూ.6650, కలకత్తాలో రూ.6635, బెంగళూరులో రూ.6635, కేరళలో రూ.6635, వడోదరలో రూ.6640, జైపూరులో రూ.6650, నాశిక్ లో రూ.6738, మైసూరులో రూ.6635, అయోధ్యలో రూ.6650, బళ్లారిలో రూ.6635, గురుగ్రాములో రూ.6650, నోయిడాలో రూ.6650 వద్ద కొనసాగుతున్నాయి. అయితే ఈ ధరలు టాక్సులు, వ్యాపారులు లాభాలు, తరుగు వంటికి కలపక ముందు రేట్లని గుర్తుంచుకోండి.

Good News gold and silver prices fell drastically on saturday buyers in shopping rush

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.8700 భారీ తగ్గుదలను నేడు చూసింది. దీంతో వివిధ ప్రముఖ నగరాల్లో తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గ్రాముకు పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7304, ముంబైలో రూ.7238, దిల్లీలో రూ.7253, కలకత్తాలో రూ.7238, బెంగళూరులో రూ.7238, కేరళలో రూ.7238, వడోదరలో రూ.7243, జైపూరులో రూ.7253, నాశిక్ లో రూ.7241, మైసూరులో రూ.7238, అయోధ్యలో రూ.7253, బళ్లారిలో రూ.7238, గురుగ్రాములో రూ.7253, నోయిడాలో రూ.7253గా ఉన్నాయి.

ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6,635గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7,238 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.2000 తగ్గి రూ.96,500 వద్ద కొనసాగుతోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+