ఏ చిన్న ధరల మార్పు అయిన మధ్య తరగతి కుటుంబ బడ్జెట్‌పై ప్రభావం చూపుతుంది. అది పెట్రోల్, డీజిల్, గ్యాస్ అయినా - ధరల ఊగిసలాటలో సామాన్యుడి జీవితం నిలకడ కోల్పోతుంటుంది. అలాంటి పరిస్థితుల్లో, జూలై నెల మొదటి రోజే ప్రభుత్వం ఒక మంచి శుభవార్త తీసుకొని వచ్చింది. ప్రతి నెల మొదటి తేదీన గ్యాస్ సిలిండర్ల ధరలను సవరించే ఆయిల్ కంపెనీలు, ఈ రోజు ఎల్పీజీ 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను రూ.58.50 తగ్గించారు. అయితే, 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఈ మార్పు నేరుగా ఇంటింటికీ ప్రభావం చూపించకపోయినా, పరోక్షంగా ఆహార ధరలపై, రోడ్డుపై చిన్నచిన్న టిఫిన్ కేంద్రాలపై, స్ట్రీట్ ఫుడ్ బండి పై తక్కువ ధరల్లో ఆహారం అందించే అవకాశాన్ని కలిగించనుంది.

జూలై 1, 2025న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్‌పై రూ. 58.50 తగ్గింపు ప్రకటించాయి. ఈ తగ్గింపు ప్రభావంతో దేశవ్యాప్తంగా ముఖ్యమైన నగరాల్లో గ్యాస్ ధరలు తక్కువయ్యాయి. ఉదాహరణకు, ముంబైలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1,674.50 నుంచి రూ. 1,616కు, ఢిల్లీ నగరంలో రూ. 1,723.50 నుంచి రూ. 1,665కు చేరింది. కోల్‌కతాలో ఇప్పుడు 19 కేజీ సిలిండర్ ధర రూ. 1,826 నుండి రూ. 1,769కు మారింది. చెన్నైలో ఇది రూ. 1,881 నుంచి రూ. 1,823.50కు తగ్గింది.
గృహ వినియోగాలకి వాడే 14.2 కేజీ LPG సిలిండరల ధరలో ఏ మార్పు లేదు. సంబంధిత నగరాల ధరలు ఢిల్లీలో రూ. 853, ముంబైలో రూ. 852.50, చెన్నైలో రూ. 868.50, కోల్‌కతాలో రూ. 879 ఇలా ఉన్నాయి. ఈ నిర్ణయం కొనసాగుతున్న అంతర్జాతీయ క్రూడ్ మార్కెట్ లో స్థిరత్వం. ఈ కారణంగా గత 4 నెలలుగా వాణిజ్య సిలిండర్ల ధరలు కొద్ది కొద్దిగా తగ్గుతూ వచ్చాయి. ఏప్రిల్ లో రూ. 41, మే లో రూ. 14.50, జూన్‌లో రూ. 24, ఇప్పుడు జూలైలో రూ. 58.50 తగ్గింపు .
ఈ వాణిజ్య గ్యాస్ ధరల మార్పు వల్ల వంటింటిలో ఉపయోగపడే సిలిండరల్ల మీద ఏ ప్రభావం చూపకపోయినా, పరోక్షంగా కొన్ని రకాలుగా సాధారణ కుటుంబాలకు ఉపశమనం కలిగించనుంది. ముఖ్యంగా రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, చిన్న హోటళ్లు వంటివి వంట కోసం 19 కేజీ కమర్షియల్ సిలిండర్‌లను ఉపయోగిస్తాయి. ఇప్పుడు ధర తగ్గడంతో, వారి వంట ఖర్చులు కొంత మేర తగ్గుతాయి. ఉదాహరణకి, నెలకు 10 సిలిండర్లు ఉపయోగించే టిఫిన్ సెంటర్ నెలకు రూ. 585 వరకు సిలిండర్ పై ఆదా అవుతుంది. ఈ ఆదాయంతో వారు తమ ఫుడ్ ఐటెమ్స్ ధరలను పెంచకుండా ఉంచేందుకు అవకాశం ఉంటుంది, కొన్నిసార్లు తగ్గించవచ్చు కూడా. ఇది బయట తింటున్న సామాన్యులకు ప్రయోజనం కలిగిస్తుంది.
ఇలా క్రమంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం(ఇన్‌ఫ్లేషన్) మధ్య, వ్యాపారాలు తమ ఉత్పత్తులపై ధరలు పెంచడం సాధారణమే. అయితే ఇప్పుడు వంట గ్యాస్ ఖర్చు తగ్గిన నేపథ్యంలో, ఫుడ్ డెలివరీ, క్యాటరింగ్, మెస్ సర్వీసులు వంటి సేవలు తమ ధరలను స్థిరంగా ఉంచే అవకాశం ఉంది. దీనివల్ల రోజూ టిఫిన్ తీసుకునే విద్యార్థులు, ఉద్యోగులు లేదా పీజీ జంటలకు ఇది మంచి మార్గం.
ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమంటే, కమర్షియల్ వాణిజ్య సిలిండర్ వినియోగం మీద ప్రభుత్వానికి తక్కువ భారం పడితే, భవిష్యత్తులో గృహ వినియోగ సిలిండర్‌ల ధర తగ్గించే అవకాశాలు ఉండవచ్చు. అలాంటి పరిణామాలు జరిగితే, ప్రతి ఇంటికి మరింత ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది.
మనం ఇంట్లో వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర తగ్గకపోయినా, బయట తినే ఆహార ధరలు పెరగకుండా ఉండే అవకాశాన్ని కలిగిస్తుంది. ఇది మధ్యతరగతి జీవన శైలిలో ఒక చిన్న ఊపిరి తీసుకోగలిగే మార్గాన్ని చూపుతుంది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్‌లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్‌లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications