Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్.. ఒక్క సిగ్నల్ లేకుండా ఎయిర్ పోర్టుకు వెళ్లొచ్చు..!

దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో బెంగళూరు ఒక్కటి. బెంగళూరు ఐటీ రంగానికి చాలా ఫేమస్. నగరం ఏ విధంగా పెరిగిందో.. అదే విధంగా ట్రాఫిక్ జామ్ కూడా భారీగా పెరుగుతోంది. బెంగళూరు ట్రాఫిక్ గురించి చాలా సార్లు చర్చ జరిగింది. సిటీలో కిలో మీటర్ ప్రయాణానికి చాలా సమయం పడుతుందని విమర్శలు ఉన్నాయి. ట్రాఫిక్ వల్ల సమావేశాలకు లేటుగా వేళ్లడం, ఆఫీసులకు ఆలస్యంగా చేరుకోవడం, విమానాలు ఆలస్యం కావడం జరిగినట్లు గతంలో చాలా మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ కూడా బెంగళూరు ట్రాఫిక్ మాట్లాడారు. ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.

ఈ క్రమంలోనే ఎయిర్ పోర్టుకు వెళ్లేవారు ఇబ్బంది పడకుండా సిగ్నల్ రహిత కారిడార్ నిర్మించనున్నారు. బెంగళూరు విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు త్వరలో హెబ్బాల్ నుంచి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు పూర్తిగా సిగ్నల్-రహిత కారిడార్ ఏర్పాటు చేయనున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సదాహళ్లి అండర్‌పాస్ ప్రాజెక్టుపై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చే వారం పనులను ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 700 మీటర్ల పొడవైన ఈ అండర్‌పాస్ నిర్మాణాన్ని 15 నెలల పాటు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు చేపట్టేందుకు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు జూలై 1న నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకి అనుమతి ఇచ్చింది.

Bengaluru

విమానాశ్రయ రహదారిలోని 22 కిలోమీటర్ల హెబ్బాల్-సదాహళ్లి మార్గంలో సదాహళ్లి జంక్షన్ వద్ద మాత్రమే ట్రాఫిక్ సిగ్నల్ ఉంది. మిగిలిన కారిడార్‌లో పలు ఫ్లైఓవర్‌లు, ఎలివేటెడ్ రోడ్ల ద్వారా సిగ్నల్-రహితంగా ఉంది. రూ. 35 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆరు లేన్ల అండర్‌పాస్ కు అడ్డంకి తొలగిపోవడంతో విమానాశ్రయానికి రాకపోకలకు అంతరాయం లేకుండా ఉండనుంది. వచ్చే వారం నుంచి ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని బెంగళూరు పోలీసులు తెలిపారు.

సెప్టెంబర్‌లో అండర్‌పాస్ కోసం తవ్వకం పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్‌ను విద్యా ఇన్‌ఫ్రాబిల్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించారు. దీనికి ఇప్పటికే డిజైన్ ఇప్పటికే పూర్తయింది. జూలై, ఆగస్టు నెలలు వర్షాకాలం ఉధృతంగా ఉండే నెలలు కాబట్టి, ఈ కాలాన్ని సన్నాహక పనుల కోసం ఉపయోగించుకుంటామని తెలిపారు. ఈ అండర్‌పాస్‌ను కట్-అండ్-కవర్ పద్ధతిలో నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు ప్రతిపాదించినప్పుడు మొదట్లో ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మించాలనకున్నారు. అయితే భూ సేకరణ కష్టం కావడంతో అండర్ పాస్ గా మార్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+