ఇకపై ఏసీలు, గృహ ఉపయోగ వస్తువులు, బైసికిళ్లు, టూత్‌పేస్ట్, షూస్ వంటి వస్తువులు మరింత చౌకగా మారే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే తాజాగా జరగబోయే GST కౌన్సిల్ సమావేశంలో 12% GST స్లాబ్‌ను పూర్తిగా తొలగించాలనే ఆలోచనపై తీవ్ర చర్చలు జరగనున్నాయి. దీని వల్ల నిత్యావసర వస్తువులపై దాక్కున్న పన్ను భారం తక్కువై, సాధారణ మధ్యతరగతి ప్రజలకు గణనీయమైన ఊరట కలిగే అవకాశం ఉంది.

ఇకపై ఏసీలు, హై ఎండ్ ఉత్పత్తుల మీద కూడా పన్ను తగ్గించే ప్రతిపాదనను ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తోంది. దీని ప్రకటన రాగానే మధ్యతరగతి కుటుంబాలకు బడ్జెట్‌లో ఊరట కలుగుతుందనడంలో సందేహం లేదు.
ఇప్పటివరకు, రెండు తక్కువ ట్యాక్స్ స్లాబ్లు (5% మరియు 12%) మధ్య ఇరుక్కొని ఉన్న అనేక వస్తువులు వినియోగదారులపై కొంతమేర భారం పెడుతున్నాయి. ఉదాహరణకి, రూ. 25,000కి ఓ ఏసీ కొనగొట్టాలంటే దానిపై జమయ్యే ట్యాక్స్ దాదాపు రూ. 3,000-4,000 వరకూ చేరుతుంది. అదే ఇప్పుడు 5%కి తగ్గితే అది సాధారణ కుటుంబానికి ఓ నెల కరెంటు బిల్లుకి సరిపడే ఆదాయం అన్నమాట.
ఇంకొంచెం ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఇప్పటి వరకు రాష్ట్రాలకు GST వల్ల జరిగే ఆదాయ నష్టాన్ని భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం "కంపెన్సేషన్ సెస్" అనే అదనపు పన్నును వేసేది. ఇది 2026 మార్చిలో ముగియనుంది. దానికి బదులుగా పొగాకు వంటి పాపపు వస్తువులు' (సిన్ గూడ్స్) పై కొత్త పన్నులు వేసే ఆలోచనలో కేంద్రం ఉంది. అంటే ఆరోగ్యానికి హానికరమైన వస్తువులపై మరింత బారం వేసి, దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇతర నష్టాలకు భర్తీ చేసే దిశలో అడుగులు వేస్తోంది.
ఇంకొక మంచి వార్త ఏమిటంటే ప్రజల ఆరోగ్య భద్రతను ప్రోత్సహించేందుకు, టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లపై 18%గా ఉన్న GSTను తగ్గించాలన్న ప్రతిపాదన కూడా ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీలు దీన్ని కనీసం 12%కి తగ్గించాలని కోరుతున్నాయి. ఇది ఆమోదమైతే, మధ్యతరగతి కుటుంబాలు తక్కువ ఖర్చుతో జీవిత బీమా లేదా ఆరోగ్య బీమా పొందగలిగే అవకాశాలు మెరుగవుతాయి.
ఆరోగ్య బీమాలపై కూడా పన్ను తగ్గించే దిశగా చర్చలు జరుగుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇవన్నీ చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. ప్రజల డైలీ ఖర్చులపై నుంచి పన్ను భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం గంభీరంగా ఆలోచిస్తోంది.
ఈ మార్పులు తీసుకురావాలన్న ప్రభుత్వం యోచన వెనుక ఉన్న ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది. పన్నుల భారం తగ్గించి వినియోగాన్ని ప్రోత్సహించాలి. వినియోగం పెరిగితే, వ్యాపారాలకు లాభం, ప్రభుత్వానికి పన్ను ఆదాయం రెండూ పెరగతాయన్నది ఆలోచన.
ఇక 'డిస్ట్రిబ్యూటెడ్' ధరలు వల్ల ప్రజలు అసహనం చెందకుండా, సులభంగా అర్థమయ్యే ట్యాక్స్ స్లాబ్‌లతో వ్యవస్థను సరళీకృతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల ప్రజలు ట్యాక్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకుని, తక్కువ ధరలో నాణ్యమైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కలుగుతుంది.
మొత్తంగా చూస్తే, ఇది కేవలం పన్ను తగ్గింపు కాదు ఇది మధ్యతరగతి కుటుంబాల మీద తేలికవేసే ఒక ఆర్థిక మార్గదర్శక చర్య. దీని ప్రభావం అనుకోకుండా బలమైనదిగా ఉండే అవకాశమే ఎక్కువ. వచ్చే కొన్ని రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వస్తే, చాలా మంది ప్రజల జీవితాల పై నిజంగా చిరునవ్వులు కనిపించనున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications