కొత్త ఉద్యోగాలకి గోల్డెన్ ఛాన్స్.. ఐటీలకి కలిసొస్తున్న రోజులు.. రెజ్యూమ్ రెడీ చేసుకోండి..
కరోనా మహమ్మారి ఉద్యోగాలను చిదిమేసింది. దేశంలో ఒక్కసారిగా లాక్ డౌన్ విధించడం, ఆర్ధిక కార్యకలాపాలు అండ్ రవాణా స్తంభించి పోవడం ఇలా చెప్పుకుంటుపోతే ప్రతి ఒక్క రంగంలో ఉద్యోగాలు గాల్లో కలిసిపోయాయి. ఇదిలా ఉంటే ఐటి రంగం మాత్రం కొంతవరకు నిలకడగా తట్టుకున్నప్పటికీ ఎక్కువ కలం నిలవలేకపోయింది. దింతో ఐటి సెక్టార్లో కూడా లక్షల మంది ఉదోగాలు కోల్పోయారు. భారతదేశంలో కొత్త ఉద్యోగాల కోసం రిక్రూట్‌మెంట్‌ను నిలిపివేసిన టెక్ కంపెనీలు, స్టార్టప్‌లు మళ్లీ రిక్రూట్‌మెంట్‌ను ప్రారంభించనున్నాయి.
గత 12 నుంచి 18 నెలల తర్వాత మళ్ళీ ఉపాధి పెరగడం ఈ రంగంలో చదువుకున్న వారిలో నమ్మకం నింపింది.Xpheno విడుదల చేసిన డేటా ప్రకారం, భారతదేశంలో కొత్త ఉద్యోగుల సంఖ్య మార్చిలో 1,68,000 నుండి ఏప్రిల్‌లో 1,56,000 తరువాత మేలో 1,07,000కి పడిపోయింది. ఇదిలా ఉంటే, కొత్తగా ఉద్యోగాలు కోరే వారి సంఖ్య పెరుగుతోందని ఎక్స్‌ఫెనో తెలిపింది.

అలాగే అంతర్జాతీయంగా ఐటీ రంగం మందగమనం, ఐటీ కంపెనీలు ఖర్చు తగ్గించుకోవడం వంటివి మార్చి నుంచి మే వరకు ఉద్యోగావకాశాలు తగ్గడానికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు వివిధ ఐటీ కంపెనీలు మళ్లీ ఫ్రెషర్లను నియమించుకోవడం ప్రారంభించనున్నాయి. ముఖ్యంగా క్యాంపస్ ద్వారా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకోవడం ప్రారంభిస్తున్నట్లు చెబుతున్నారు.
గత రెండు, నాలుగు త్రైమాసికాల మందగమనం నుంచి ఐటీ రంగం కోలుకుంటున్నందున కొత్త ఉద్యోగుల కోసం అన్వేషణ పెరిగిందని naukri.com సీఈవో హితేష్ ఒబెరాయ్ అన్నారు. కొత్త ఉద్యోగుల సంఖ్య సెప్టెంబర్‌లో 1,34,000కి పెరిగింది. ముఖ్యంగా మొదటి టాప్ నగరాల్లోని కంపెనీలు 85 శాతం ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. TCS, Infosys, Wipro, Tech Mahindraలు FY2025 నాటికి 81,000 - 88,000 ఫ్రెషర్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. దింతో గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది.
అలాగే భారత్‌లో ఐటీ రంగంలో జీతాల పెంపుదల ఐదు నుంచి ఏడు శాతం మధ్య ఉండొచ్చని ఈ కంపెనీలు ఒక అంచనాను విడుదల చేశాయి. ఎక్స్‌పెనో ప్రకారం, పెద్ద నగరాల్లో ఐటీ రంగం, స్టార్టప్‌లలో ఉద్యోగావకాశాలు పెరిగినప్పటికీ, రెండవ, మూడవ రేంజ్ నగరాల్లో వృద్ధి స్పష్టంగా కనిపించడం లేదు. భారతదేశానికి సంబంధించినంతవరకు, స్టార్టప్‌లు 2022 ప్రారంభం నుండి దాదాపు 30,000 మందిని తొలగించాయి.
ఇప్పుడు ఈ కంపెనీలు మళ్లీ కొత్త ఉద్యోగులను నియమించుకోవడం ప్రారంభించనున్నాయి. ముఖ్యంగా బెంగళూరు, పుణె నగరాల్లో స్టార్టప్ కంపెనీలే ఉపాధిని పెంచాయి. బెంగళూరులో అత్యధికంగా స్టార్టప్‌లు 37 శాతం ఉపాధి పెరిగాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ ఇతర రంగాలలో పనిచేయగల కంపెనీలు ఉద్యోగాలకు ఫ్రెషర్లను సెలక్ట్ చేసుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications