Bengaluru News: ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. తుమకూరు నుంచి ఎలక్ట్రానిక్ సిటీకి డైరెక్ట్ బస్సులు..!
బెంగళూరు అంటే మనకు గుర్తుకు వచ్చేది ఐటీ. అక్కడ అంతగా టెక్ కంపెనీలు ఉన్నాయి. అంతర్జాతీయ కంపెనీలు నగరంలో ఉండడంతో లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు. బెంగళూరు అభివృద్ధితో పాటు జనాభా, వాహనాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. దీంతో బెంగళూరు వాసులు ట్రాఫిక్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నగర ట్రాఫిక్ పై చాలా సార్లు సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అయితే ప్రభుత్వం కూడా ట్రాఫిక్ నియంత్రణకు ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లే ఐటీ ఉద్యోగులు ట్రాఫిక్ తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
ఐటీ కారిడార్ లో టెక్కీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి ఊరట కల్పించేందుకు బెంగళూరు మహానగర రవాణా సంస్థ (BMTC) శ్రీకారం చుట్టింది.
తుమకూరు నుంచి బెంగళూరు ఐటీ హబ్ ఎలక్ట్రానిక్స్ సిటీ మధ్య ప్రయాణించే వందలాది మంది ఉద్యోగుల కోసం విస్తారా ఏసీ బస్సు సర్వీసులు ప్రారంభించింది. దీంతో ట్రాఫిక్లు ట్రాఫిక్ సమస్య లేకుండా ఆఫీసులకు వెళ్లొచ్చు. మకూరు నుంచి బెంగళూరు ఐటీ హబ్ ఎలక్ట్రానిక్స్ సిటీ మధ్య సుమారు 101 కిలోమీటర్లు ఉంటుంది. బెంగళూరు మహానగర రవాణా సంస్థ నడబుతున్న బస్సు సర్వీసుల్లో ఈ మార్గమే పొడవైనది. కర్ణాటక ప్రభుత్వం బీఎంటీసీకి గ్రేటర్ బెంగళూరు పరిధి దాటి దాదాపు 40 కిలోమీటర్ల వరకు బస్సులు నడుపుకునేందుకు అనుమతి ఇచ్చింది.

దీంతో ఈ మార్గంలో బస్సు సర్వీసులు ప్రారంభం అయ్యాయి. శాటిలైట్ టౌన్స్ గుండా ఈ బస్సు సర్వీసులు నడవనున్నాయి. ఈ ఏసీ బస్సులతో ఐటీ ఉద్యోగులు త్వరగా కార్యాలయాలకు చేరుకుంటారు. ఈ మార్గం గుండా ఐటీ ఉద్యోగులు వెళ్తే.. ముప్పవు గంట నుంచి గంట సమయం ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు. బస్సులు ఉదయం 7 గంటల 45 నిమిషాలకు తుమకూరులో బయల్దేరుతోంది. అలాగే 9 గంటల 45 నిమిషాల వరకు ఎలక్ట్రానిక్స్ సిటీకి చేరుకుంటుందని బెంగళూరు మహానగర రవాణా సంస్థ అధికారులు తెలిపారు.
సాయంత్ర ఉద్యోగులు బయటకు వచ్చే సమయంలో సర్వీసులు తిరిగి ప్రారంభం అవుతాయి. సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు ఎలక్ట్రానిక్స్ సిటీ నుంచి బస్సులు ప్రారంభం అవుతాయి. రాత్రి 9 గంటల వరకు తిరిగి తుమకూరుకు చేరుకుంటాయి. ఈ బస్సులో వనే వే ఛార్జీ రూ.200 గా ఉంది. ఈ బస్సులు తుమకూరు, నేలమంగళ, మాదవర, నైస్ రోడ్ లో ఆగుతాయి. ప్రజా డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ సరికొత్త ఏసీ సర్వీస్‌ను ప్రారంభించినట్లు బీఎంటీసీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ జి.టి. ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం తుమకూరు - ఎలక్ట్రానిక్స్ సిటీ మధ్య ప్రయాణికుల ఆదరణ చాలా బాగుందని వివరించారు. గతంలో మేము నైలామంగళ, హోస్కోట్ మధ్య 80 కిలోమీటర్ల రూట్‌ను ప్రారంభించినట్లు గుర్తు చేశారు.


Click it and Unblock the Notifications