బెంగళూరు అంటే ఐటీ జాబ్స్, రద్దీ రోడ్లు, ఇంకా ఆకాశాన్ని తాకే అద్దెలు గుర్తొస్తాయి. గత రెండేళ్లలో ఇళ్ళు అద్దెకు తీసుకోవడం అనేది చాలా మందికి పెద్ద సవాలుగా మారింది. కానీ ఇప్పుడు పరిస్థితి కొంచెం మారుతోంది. అద్దె ధరలు కాస్త చల్లారు తున్నాయి. కొత్త ఇళ్లు ఎక్కువ కావడం, ఉద్యోగ మార్కెట్ మందగించడం, ఇంకా హైబ్రిడ్ వర్క్ వల్ల డిమాండ్ తగ్గిపోవడం. ఇవన్నీ కలిసే ఈ మార్పు తీసుకొచ్చాయి.

కొన్ని సంవత్సరాలుగా బెంగళూరులో అద్దె మార్కెట్ వేగంతో పెరిగాయి. ముఖ్యంగా 2022 చివరి నుంచి 2023 వరకు, IT ఉద్యోగులు ఆఫీస్‌కి తిరిగి రావాలని కంపెనీలు ఆదేశించడంతో, డిమాండ్ ఒక్కసారిగా పెరిగి అద్దె ధరలు రికార్డు స్థాయికి చేరాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. కొత్త ఇళ్ల సంఖ్య పెరగడం, IT రంగంలో నియామకాల మందగమనం, జీవన ఖర్చులు పెరగడం వంటి కారణాల వల్ల అద్దె మార్కెట్ క్రమంగా చల్లబడుతోంది.
ఇటీవలి 3BHK అపార్ట్‌మెంట్లకు రూ. 50,000 నుంచి రూ. 75,000 వరకు నిర్భయంగా డిమాండ్ చేసిన ఇంటి యజమానులు, ఇప్పుడు రూ. 35,000 నుంచి రూ. 55,000 మధ్యకే ఒప్పుకుంటున్నారు. అంటే 25-30% వరకు తగ్గుదల కనిపిస్తోంది. ఈ మార్పు సోషల్ మీడియా యూజర్లు, బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ నిపుణులు కూడా చెప్తున్నారు.
రాజాజినగర్, బసవేశ్వర నగర్, మల్లేశ్వరం వంటి పాత ప్రాంతాల్లో డిమాండ్ గణనీయంగా తగ్గింది. కారణం కొత్తగా నగరానికి వచ్చే IT ఉద్యోగులు ఎక్కువగా ఈ ప్రాంతాలను ఎంచుకోవడం లేదు. వీరు ఎక్కువగా IT హబ్‌లకు దగ్గరగా ఉన్న ప్రాంతాలనే ప్రాధాన్యం ఇస్తున్నారు.
బెంగళూరులో అద్దె ధరలు తగ్గడానికి రియల్ ఎస్టేట్ నిపుణులు మూడు ప్రధాన కారణాలను చూపిస్తున్నారు. మొదటిగా, గతంలో మార్కెట్లో ఇళ్ల సరఫరా తక్కువగా ఉండగా, ఇప్పుడు కొత్తగా పూర్తయిన అపార్ట్‌మెంట్లు ఎక్కువ సంఖ్యలో అందుబాటులోకి రావడంతో సరఫరా పెరిగింది. రెండవది, IT మరియు స్టార్టప్ రంగాల్లో నియామకాల మందగమనం. పెద్ద కంపెనీలు ఉద్యోగాలను తగ్గించడం, కొత్త రిక్రూట్‌మెంట్ తగ్గించడం వల్ల అద్దె కోసం వచ్చే కొత్త కస్టమర్ల సంఖ్య తగ్గింది. మూడవది, జీవన ఖర్చులు గణనీయంగా పెరగడంతో అద్దెదారులు ఇప్పుడు ధర విషయంలో మరింత జాగ్రత్తగా, బేరసారాలు చేస్తూ ఉంటున్నారు. 2022-23లో రిటర్న్ టు ఆఫీస్ ఆదేశాల కారణంగా అద్దెలు భారీగా పెరిగినా, ఇప్పుడు హైబ్రిడ్ వర్క్ మోడల్ ప్రాచుర్యం పెరగడం వల్ల కొంతమంది ఉద్యోగులు పూర్తిగా నగరానికి రావాల్సిన అవసరం లేకుండా పోయింది, దీని వల్ల డిమాండ్ తగ్గి అద్దె ధరలు స్థిరపడుతున్నాయి.
హాను రెడ్డి రియాల్టీ ప్రకారం, గత కొన్ని నెలలతో పోలిస్తే అద్దె కోసం వచ్చే విచారణలు సుమారు 15% తగ్గాయి. సాధారణంగా జనవరి-ఫిబ్రవరిలో డిమాండ్ పెరుగుతుంటే, ఈ ఏడాది పండుగల కారణంగా ఆ డిమాండ్ ఆలస్యం అవుతోంది.
IT రంగం బెంగళూరులో అద్దె మార్కెట్‌ను నడిపించే ముఖ్యమైనది కానీ, ఇటీవల టీసీఎస్ 2026 ఆర్థిక సంవత్సరంలో 2% (దాదాపు 12,000) ఉద్యోగాలను తగ్గించనున్నట్లు ప్రకటించింది. అలాగే ఇంటెల్, మైక్రోసాఫ్ట్, టెస్లా వంటి కంపెనీలు కూడా ఉద్యోగ కోతలు చేపట్టాయి. ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా సాంప్రదాయ IT ఉద్యోగాల డిమాండ్ తగ్గుతోంది. ఈ మార్పులు అద్దె మార్కెట్‌లో కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
బెంగళూరులో టెక్ రంగంలో పనిచేసే ఉద్యోగుల అధిక ఆదాయం వల్ల నగర జీవనశైలిపై పెద్ద ప్రభావం చూపుతుంది. వారి ఖర్చు ఎక్కువగా ఉండటంతో, సినిమా టికెట్లు, ప్రయాణ ఛార్జీలు, రెస్టారెంట్ భోజనాలు వంటి అనేక సేవలు, ఉత్పత్తులు సహజంగానే ఎక్కువ ధరలకు లభిస్తున్నాయి. అయితే, టెక్ రంగం వేగం తగ్గితే, ఈ అధిక ధరలు కూడా క్రమంగా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఏ ఏరియాల్లో అద్దెలు తగ్గాయి?
2023లో కోరమంగల, సర్జాపూర్ రోడ్, వైట్ఫీల్డ్, బెల్లందూర్ వంటి ప్రముఖ ప్రాంతాల్లో అద్దెలు 30-35% వరకు పెరిగినా, ప్రస్తుతం 3-5% వరకు తగ్గుముఖం పట్టాయి. మధ్యస్థ విభాగంలో, బీటీఎం లేఅవుట్ మరియు సర్జాపూర్ ప్రాంతాల్లో 2BHK ఇళ్ల అద్దెలు గతంలో రూ. 35,000-రూ. 40,000 ఉండగా, ఇప్పుడు రూ. 30,000కి పడిపోయాయి. అలాగే, వైట్ఫీల్డ్ సమీపంలోని బగలూరులో ఇలాంటి ఇళ్లు రూ. 27,000-రూ. 30,000 మధ్యకే లభిస్తున్నాయి.
బెంగళూరు అద్దె మార్కెట్ ఇప్పుడు సర్దుబాటు దశలో ఉంది. గతంలో పెరిగిన రేట్లు ఇప్పుడు స్థిరపడుతుండటం అద్దెదారులకు శుభవార్తే. కానీ, ఈ పరిస్థితి ఎంతకాలం కొనసాగుతుందో IT రంగం భవిష్యత్‌పై ఆధారపడి ఉంటుంది.
More From GoodReturns

Bengaluru: యాపిల్ కంపెనీలో ఉద్యోగం.. లక్షల్లో జీతం.. కానీ ఈ టెక్కీ ఆటో ఎందుకు నడుపుతున్నాడో తెలుసా?

Bengaluru: రియల్ ఎస్టేట్‌లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్‌లో ట్రెండ్ ఎలా ఉందంటే..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!

హైదరాబాద్ నీటి కష్టాలు: ఐటీ కారిడార్‌లో అద్దెలు ఆకాశానికి!

హైదరాబాద్ ఎండలు, కరెంట్ కోతలు.. రియల్ ఎస్టేట్‌లో పెరిగిన డిమాండ్!

బెంగళూరు అద్దెలు షాకింగ్: సామాన్యుల పరిస్థితి ఏంటి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Hyderabad: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు! అలాంటి ఇళ్లకే ఫుల్ డిమాండ్!

Bengaluru: బెంగళూరులో రూ. 500తో రోజంతా గడపడం సాధ్యమేనా? ఈ యువతి ఏం చేసిందో చూడండి!

ఒకప్పుడు మ్యాగీ తింటూ గడిపాడు! నేడు నెలకు రూ. 3.5 లక్షల సంపాదిస్తున్నాడు!

Bengaluru: రోడ్లు చూస్తే గుంతలు.. బడ్జెట్ చూస్తే వేల కోట్లు! అసలు డబ్బు అంతా ఎటు వెళ్తోంది?



Click it and Unblock the Notifications