ఐఫోన్ కొనేందుకు మంచి ఛాన్స్: అమెజాన్ డిస్కౌంట్ అఫర్.. ఐఫోన్ 15 పై భారీ తగ్గింపు..!
తక్కువ ధరకు ఐఫోన్ కావాలని ఎవరు కోరుకోరు..? ఇప్పుడు ఐఫోన్ స్టేటస్'కు సింబల్గా కూడా మారింది. అందుకే ప్రతి ఒక్కరి దగ్గర ఐఫోన్ కనిపిస్తుంటుంది, దీనిని తరచుగా రిచ్ కిడ్స్ ఫోన్ అని కూడా పిలుస్తారు. చాలా మంది యువకులకు ఐఫోన్ అంటే ప్రాణం. ముఖ్యంగా తక్కువ ధరకు ఐఫోన్ దొరికితే ఎగిరిగంతేస్తారు. ప్రస్తుతం ఉన్న EMI అప్షన్ కారణంగా ఐఫోన్ ఎంత ఖరీదైనదైనా కొనడం ఈజీ. కానీ ఐఫోన్ ప్రియులకు ఇప్పుడు మరో శుభవార్త ఉంది. అదేంటంటే అమెజాన్ ఐఫోన్ 15 ప్రో మాక్స్ పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది.
అవును, Amazonలో iPhone 15 Pro Max పై భారీ ధర తగ్గింపు అందిస్తుంది. ఐఫోన్ కొనాలని ఆలోచిస్తున్న వారికి ఇది చాలా మంచి ఛాన్స్. ఫిబ్రవరి 26న అమెజాన్‌లో ఐఫోన్ ధర రూ.1 లక్ష 28 వేల 900. ఉంది. ఈ మొబైల్ మొదట ఇండియాలో రూ.1లక్ష59వేల900కు లాంచ్ చేసారు. అంటే అమెజాన్ ఇప్పుడు రూ.31 వేలు డిస్కౌంట్ ఇస్తోంది.

256 GB స్టోరేజ్ ఉన్న iPhone 15 Pro Max మొబైల్ పై ఈ డిస్కౌంట్ అఫర్ వర్తిస్తుంది. అంతేకాదు మీరు మరో రెండు వేల ఎక్సట్రా డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అంటే, ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMIని సెలెక్ట్ చేసుకునే కస్టమర్లకు అదనంగా రూ. 2,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఐఫోన్ 16 ప్రో మాక్స్‌తో పోలిస్తే 15 ప్రో మాక్స్ కాస్ట్లీ ఫోన్. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ విడుదలైనప్పుడు దాని ధర రూ.1,44,900గా ఉంది. అంటే 15 ప్రో మాక్స్ కంటే దాదాపు రూ. 15,000 ఎక్కువ. 2023లో iPhone 15 Pro Max కొత్త A17 Pro చిప్, టైటానియం బాడీ, 5X పెరిస్కోప్ కెమెరా, USB-C పోర్ట్ వంటి ఫీచర్స్'తో విడుదలైంది. ఇది ఐఫోన్ 15 సిరీస్‌లో అత్యుత్తమ ప్రీమియం మోడల్ ఇంకా గేమింగ్, ఫోటోగ్రఫీ అలాగే ప్రొఫెషనల్ యూజర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఇందులో బెస్ట్ అప్షన్స్ ఉంటాయి.
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫీచర్లు:
*6.7-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్ ప్లే
*స్మూత్ స్క్రోలింగ్ అండ్ మెరుగైన వ్యూ ఎక్స్పీరియన్స్
*స్క్రీన్ పగిలిపోతే అదనపు రక్షణ కోసం సిరామిక్ షీల్డ్ టెక్నాలజీ
*పాత స్టీల్ ఫ్రేమ్ కంటే తేలికైన, బలమైన ఇంకా ప్రీమియం లుక్ ఉన్న కొత్త మెటీరియల్
*వేగవంతమైన స్పీడ్, తక్కువ బ్యాటరీ వినియోగం,
*మెరుగైన గేమింగ్, ఫోటో ఎడిటింగ్ అనుభవం
*మరిన్ని న్యాచురల్ గేమింగ్ గ్రాఫిక్స్
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కెమెరా:
*48MP ప్రైమరీ కెమెరా - హై-డిటెయిలింగ్ & లో-లైట్ ఫోటోలను షూట్
*12MP అల్ట్రా-వైడ్ లెన్స్ - వైడ్ యాంగిల్‌లో ఫోటోలను క్యాప్చర్ చేయడంలో సహాయపడుతుంది
*5X పెరిస్కోప్ టెలిఫోటో జూమ్ - ఇప్పుడు ఫోటోలను క్యాప్చర్ చేయడానికి 5X జూమ్‌కు సపోర్ట్ ఇస్తుంది
*120mm ఈక్వివలెంట్ లెన్స్ - ప్రొఫెషనల్ కెమెరా-లెవల్ జూమ్ షాట్స్


Click it and Unblock the Notifications