ఇన్ఫోసిస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జీతాల పెంపు.. ఈ నెల నుండి అమలులోకి..
భారతదేశంలో రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ తాజాగా ఉద్యోగులకు మార్చి నెలాఖరులోగా అన్యువల్ కాంపెన్సేషన్ రివిజన్ లెటర్స్ విడుదల చేస్తామని తెలిపింది. అయితే డెలివరీ యూనిట్ల నుండి వచ్చిన సిఫార్సుల ఆధారంగా పెంపుపై పని చేస్తునట్లు చెప్పారు.
"జాబ్ లెవెల్ 5 (JL5) అండ్ అంతకంటే తక్కువ ఉన్నవారికి జనవరి 1 నుండి పెంపుదల అమలులోకి వస్తుంది అలాగే జాబ్ లెవెల్ 6 (JL6) ఇంకా అంతకంటే పై ఉన్నవారికి ఏప్రిల్ 1 నుండి వేతన పెంపు లభిస్తుంది" అని బెంగళూరులోని ఇన్ఫోసిస్ క్యాంపస్‌లోని చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ షాజీ మాథ్యూ ఉద్యోగులకు టౌన్‌హాల్‌లో తెలిపారు.

"మీ పర్ఫార్మెన్స్ అండ్ ఎవాల్యువేషన్ ప్రమాణాల ఆధారంగా మేనేజర్లు ఇప్పటికే మీ రేటింగ్‌లను మీకు షేర్ చేసారు. అలాగే ఫీడ్ బ్యాక్ కూడా మాతో షేర్ చేసుకున్నారు. ఎవాల్యువేషన్ ఆధారంగా పెంపు శాతంపై మేము పని చేస్తున్నాము" అని మాథ్యూ చెప్పినట్లు తెలిపారు. కానీ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ ఎటువంటి అప్రైసల్ గురించి ప్రస్తావించలేదు.
అంతకుముందు ఉద్యోగులు ఏప్రిల్ నుండి అమలులోకి వచ్చే పెంపు కోసం జూన్‌లో కాంపెన్సేషన్ రివిజన్ లెటర్స్ అందుకున్నారు, కానీ సెప్టెంబర్ 2022-అక్టోబర్ 2023 సంబంధించి 2024లో ఆలా జరగలేదని తెలిపారు. బోర్డు చివరి పెంపు 1 నవంబర్ 2023లో అమలులోకి వచ్చింది. అంతకుముందు ఇన్ఫోసిస్ FY2022లో జీతాల పెంపును నిలిపివేసింది. అక్టోబర్ 2023 నుండి అన్యువల్ అప్రెయిజల్ ప్రారంభించింది, డిసెంబర్ 2023లో చివరి పెంపు లెటర్స్ విడుదల చేసింది.
"భారతదేశంలో మేము 6-8% పెరుగుదలను ఆశిస్తున్నాము. విదేశాలలో కాంపెన్సేషన్ (పరిహారం) గత కాంపెన్సేషన్ రివ్యూస్ అనుగుణంగా ఉంటుంది," అని గత నెలలో కంపెనీ ఆదాయ ప్రకటన సందర్భంగా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేష్ సంఘ్రాజ్కా అన్నారు."వాస్తవానికి, అధిక పనితీరు కనబరిచిన వారికీ వేతన పెంపు ఎక్కువగా ఉంటుంది అలాగే విదేశాలలో కాస్త తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా మార్జిన్ మేము నిజంగా చెప్పలేము. చాలా మంది ఉద్యోగులకు Q4లో కాంప్లిమెంట్ పెంపు లభిస్తుంది" అని అన్నారు.
జనవరి 1 అలాగే ఏప్రిల్ 1 నుండి రెండు దశల్లో కాంపెన్సేషన్ చెల్లింపులు జరుగుతుందని పేర్కొన్నారు. టీమ్ లీడర్లు JL5 (జాబ్ లెవల్ 5) ఎంప్లాయ్ ర్యాంక్‌లో ఉంటారు, దీని కంటే తక్కువలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, సీనియర్ ఇంజనీర్లు, సిస్టమ్ ఇంజనీర్లు, కన్సల్టెంట్లు ఉంటారు. JL6 ఇంకా అంతకంటే పై లెవెల్ లో మేనేజర్లు, సీనియర్ మేనేజర్లు, డెలివరీ మేనేజర్లు అలాగే సీనియర్ డెలివరీ మేనేజర్లు ఉంటారు. JL6 ఇంకా అంతకంటే పై ఉద్యోగుల తాజా పెంపు కూడా కంపెనీ ఆదాయంతో ముడిపడి ఉందని తెలిపారు. అక్టోబర్-డిసెంబర్ కాలానికి ఇన్ఫోసిస్ మొత్తం లాభంలో 11.4% పెరుగుదల, గత సంవత్సరం కంటే 7.6% ఆదాయం పెరుగుదలతో అంచనా కంటే మెరుగైన ఫలితాలను నమోదు చేసింది.


Click it and Unblock the Notifications