ఉద్యోగుల భవిష్యత్‌కి భద్రత కలిగించే ప్రధాన పథకాల్లో ఒకటి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF). ఇది ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందినప్పుడు లేదా అత్యవసర సమయంలో ఉపయోగా వస్తుంది. కానీ దీనికి అనుసంధానంగా వచ్చే వడ్డీ పరంగా గతంలో జమ ప్రక్రియ ఆలస్యం కావడం ఉద్యోగుల్లో అసంతృప్తిని కలిగించింది.

ఇలాంటి సమయంలో కేంద్ర కార్మిక మంత్రి మాన్సుఖ్ మాండవియా జులై 8న ఇచ్చిన ప్రకటన ఎంతో ఊరట కలిగించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 8.25% వడ్డీ రేటును ప్రభుత్వం ఖరారు చేసింది. గత సంవత్సరం, 2023-24 ఆర్థిక సంవత్సరానికి, సభ్యుల ఖాతాల్లో వడ్డీ జమ చేసే ప్రక్రియ ఆగస్టులో ప్రారంభమై డిసెంబరులో పూర్తయింది. ఇది గతంతో పోలిస్తే తక్కువ కాదు, పైగా మంచి రాబడిగా చెప్పవచ్చు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న 33 కోట్ల 56 లక్షల EPF ఖాతాల్లో సుమారు 96.5 శాతం ఖాతాలకు వడ్డీ జమ అయినట్లు ఆయన వెల్లడించారు. అంటే, దాదాపు 32 కోట్ల 39 లక్షల ఖాతాదారులకు వడ్డీ చేరింది. మిగిలిన ఖాతాల్లోకి కూడా ఈ వారంలోపు వడ్డీ జమ చేయనున్నారు.
ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయడంలో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోంది. జూన్ 6 నుంచి ఇది ప్రారంభమై, జులై మొదటి వారంలోనే భారీ సంఖ్యలో ఖాతాల్లోకి వడ్డీ చేరటం విశేషం. మొత్తంగా ఈసారి రూ. 4,000 కోట్లకుపైగా వడ్డీ మొత్తం EPF సభ్యుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది.
ఈ పరిణామం EPFO పై నమ్మకాన్ని బలోపేతం చేయడమే కాకుండా, ఉద్యోగుల ఆర్థిక భద్రతపై ప్రభుత్వం తీసుకుంటున్న బాధ్యతను చాటుతోంది. వడ్డీ ప్రక్రియ పారదర్శకంగా, వేగంగా జరగడం పట్ల చాలామంది ఉద్యోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రావిడెంట్ ఫండ్ జమ ప్రక్రియపై గతంలో వచ్చిన విమర్శలకు ఇది సరైన స్పందన గా నిలిచింది. ఉద్యోగులు తమ భవిష్యత్తుకు భద్రతగా భావించే ఈ పథకంపై ప్రభుత్వం చూపుతున్న దృష్టిని అభినందించాల్సిందే.
వడ్డీ జమ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలి?
మీ EPF ఖాతాలో వడ్డీ జమ అయిందా లేదా అనే విషయాన్ని మీరు సులభంగా EPFO అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. దానికోసం ఈ క్రింది దశలను అనుసరించండి:
1. EPFO వెబ్‌సైట్ (www.epfindia.gov.in)కి వెళ్లండి.
2. హోమ్‌పేజీలో ఉన్న "Our Services" సెక్షన్‌లోకి వెళ్లండి.
3. అక్కడ "For Employees" అనే ఎంపికపై క్లిక్ చేయండి.
4. తరువాత వచ్చిన పేజీలో "Member Passbook" అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
5. ఆ తర్వాత, మీ UAN (Universal Account Number), పాస్‌వర్డ్ మరియు క్యాప్చా కోడ్ నమోదు చేసి లాగిన్ అవ్వాలి.
6. లాగిన్ అయిన తర్వాత మీకు సంబంధించిన EPF ఖాతా వివరాలతో పాటు తాజాగా వడ్డీ జమ అయిందా లేదా అనేది పాస్‌బుక్‌లో స్పష్టంగా కనిపిస్తుంది.
కొంతమందికి వడ్డీ ఇప్పటికే జమ అయి ఉండవచ్చు. మరికొంతమందికి త్వరలో జమ అవుతుంది. పాస్‌బుక్‌లో కనిపించకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు కొన్ని రోజుల్లో అప్డేట్ అవుతుంది


Click it and Unblock the Notifications