భారతదేశంలో టెక్నాలజీ మరియు డిజిటల్ సేవల్లో ముందున్న నెట్‌వర్క్ కంపెనీ భారతి ఎయిర్ టెల్ , ఈసారి వినియోగదారుల కోసం ఒక వినూత్న ఆఫర్ తీసుకొచ్చింది. ఇప్పటి వరకు మొబైల్ నెట్‌వర్క్ కంపెనీలు ఎక్కువగా OTT ప్లాట్‌ఫారమ్‌లను (నెట్‌ఫ్లిక్స్, అమజోన్ ప్రైమ్) ఉచితంగా అందిస్తూ వచ్చాయి. కానీ, ఈసారి ఎయిర్ టెల్ నేరుగా ఒక AI ఆధారిత ప్రీమియం టూల్ పెర్ప్లెక్సిటీ ప్రో ను ఒక సంవత్సరం పాటు పూర్తిగా ఉచితంగా అందిస్తోంది.

పెర్ప్లెక్సిటీ అంటే ఏమిటి?
పెర్ప్లెక్సిటీ అనేది ఆధునిక కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతను ఉపయోగించే ఒక ప్రత్యేకమైన సెర్చ్ ప్లాట్‌ఫారమ్. ఇది మీరు అడిగే ప్రశ్నలకు కేవలం ఒకే సోర్స్ ఆధారంగా కాకుండా, ఇంటర్నెట్‌లో ఉన్న పలు విశ్వసనీయ సోర్స్లు నుంచి సమాచారాన్ని సేకరించి, సంక్షిప్తంగా, స్పష్టమైన సమాధానాలను అందిస్తుంది.
ఇది గూగుల్ సెర్చ్ మాదిరిగా కేవలం వెబ్‌లింక్స్ మాత్రమే ఇవ్వదు, లేదా చాట్‌బాట్‌లా ముందుగానే శిక్షణ పొందిన డేటాతో పరిమితమై ఉండదు. పెర్ప్లెక్సిటీ స్పష్టతతో, తాజా సమాచారం ఆధారంగా నమ్మదగిన వివరాలు ఇస్తుంది.
అలాగే, పెర్ప్లెక్సిటీ ప్రో వర్షన్ వినియోగదారులకు మరింత శక్తివంతమైన ఫీచర్లను అందిస్తుంది. ఇది ఖచ్చితమైన, స్పష్టమైన సమాధానాల కోసం "కట్టింగ్-ఎడ్జ్" లాంగ్వేజ్ మోడల్‌లైన GPT-4.1, Claude 4.0 Sonnet లను ఉపయోగిస్తుంది.
పెర్ప్లెక్సిటీ ప్రో సభ్యత్వం ద్వారా వినియోగదారులకు అనేక ప్రీమియం సదుపాయాలు లభిస్తాయి. ఇందులో ముఖ్యంగా, రోజుకు 300 AI శక్తితో కూడిన శోధనలు నిర్వహించే వీలుంటుంది. ఇది సాధారణ సెర్చ్ ఇంజిన్‌లతో పోలిస్తే చాలా వేగంగా,సరైన సమాచారాన్ని అందిస్తుంది. అంతేకాక, వినియోగదారులు తమ డాక్యుమెంట్లు లేదా ఫైళ్లను అప్లోడ్ చేసి, వాటిని విశ్లేషించుకోవాలి. అవసరమైన సమాచారం సారాంశంగా పొందడమూ సాధ్యమే.
అలాగే, DALL·E వంటి అధునాతన మోడళ్లను ఉపయోగించి టెక్స్ట్ ఆధారంగా చిత్రాలు సృష్టించుకునే అవకాశం ఉంటుంది. గూగుల్, ఓపెన్AI, అంతరోపిక్ లాంటి ప్రముఖ సంస్థల నుంచి అందించే విభిన్న లాంగ్వేజ్ మోడళ్ల మధ్య వినియోగదారులు తమకు నచ్చినదాన్ని ఎంచుకుని ఉపయోగించుకోవచ్చు. దీని ద్వారా స్ప్రెడ్‌షీట్‌లు, వెబ్ ఆప్స్, డాష్‌బోర్డ్‌లు వంటి వివిధ డేటా టూల్స్‌ను రూపొందించుకోవడం సులభమవుతుంది.
ఈ ఆఫర్‌ను ఎలా పొందాలి?
ఈ సబ్‌స్క్రిప్షన్‌ను పొందడానికి మీరు ఎయిర్ టెల్ వినియోగదారుడిగా ఉండాలి. తర్వాత ఈ క్రింది స్టెప్స్‌ను ఫాలో అవ్వాలి:
1. మీ ఫోన్‌లో ఎయిర్ టెల్ Thanks App ఓపెన్ చెయ్యాలి.
2. మెనూలో ఉన్న 'Rewards' సెక్షన్‌కి వెళ్లండి.
౩. అక్కడ కనిపించే "Get 12 months of Perplexity Pro worth రూ. 17,000 FREE" అనే దానిపై క్లిక్ చేయండి.
4. ఇంకా అప్పుడు 'Claim Now' అనే బటన్‌ను నొక్కితే మీకు ఆఫర్ వాడుకోవచ్చు. తరువాత వచ్చే స్క్రీన్‌లో, పెర్ప్లెక్సిటీ వెబ్‌సైట్ ద్వారా సైన్ అప్ లేదా లాగిన్ చేయండి.
ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత, మీరు ఏటా సబ్‌స్క్రిప్షన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితం, ఎలాంటి వివరాలు అవసరం లేదు.
ఈ ఆఫర్ ఎందుకు ప్రత్యేకం?
పెర్ప్లెక్సిటీ ప్రో ఓటీటీలు లేదా మ్యూజిక్ యాప్స్‌లా కేవలం వినోదం కోసం కాదు. ఇది ఒక ఉపయోగకరమైన టూల్. ముఖ్యంగా విద్యార్థులు, రీసెర్చ్ చేసే వారు, కంటెంట్ రైటర్లు, మార్కెటింగ్‌లో పని చేసే వారు ఈ టూల్ ద్వారా తమ పనిని వేగంగా, సులభంగా పూర్తి చేయొచ్చు. ఇది సమయాన్ని ఆదా చేస్తుంది, తాజా సమాచారాన్ని ఇస్తుంది, పని నాణ్యతను పెంచుతుంది. అందుకే ఈ ఆఫర్ సాధారణమైనది కాదు చాలా విలువైనదిగా చెప్పొచ్చు. మీరు ఎయిర్ టెల్ వినియోగదారుడైతే, ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఒక సంవత్సరం పాటు AI టెక్నాలజీని మేధస్సుగా, ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
ఈ ప్రత్యేకమైన ఆఫర్‌ను ఎయిర్ టెల్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్ (Wi-Fi) మరియు DTH వినియోగదారులు అందరూ పొందగలరు. ఒక్కసారి క్లెయిమ్ చేసిన వెంటనే, పూర్తి ఏడాది పాటు ప్రీమియం ఫీచర్లు మీకు పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంటాయి.
ఇప్పటివరకు టెలికాం కంపెనీలు ఎక్కువగా వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు (నెట్‌ఫ్లిక్స్, అమజోన్ ప్రైమ్ వంటివి) ఉచితంగా ఇచ్చేవారు. కానీ, ఎయిర్ టెల్ ఇప్పుడు తొలిసారిగా AI ఆధారిత ప్రో టూల్‌ను అదీ సంవత్సరంపాటు ఉచితంగా అందిస్తున్న మొదటి నెట్‌వర్క్ ఆపరేటర్ అయింది. ఇది టెక్నాలజీలో ఒక కొత్త దశను సూచిస్తోంది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications