వాట్సప్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది . ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం అయిన ఫేస్‌బుక్ మెసేజింగ్ సేవ సంస్థ వాట్సప్ తన యూజర్స్ కోసం చాలా ఫీచర్స్ అందుబాటులోకి తెచ్చే పనిలో ఉంది . ఇప్పటికే కరోనా లాక్ డౌన్ సమయంలో వాట్సప్ వినియోగం విపరీతంగా పెరిగింది . ఇక ఈ సమయంలో వాట్సప్ వినియోగదారులు ప్రస్తుత తమ ఖాతాను మల్టీ డివైస్‌లకు కనెక్ట్ చేయడానికి అనుమతించే ఫీచర్ కోసం తెగ వెతుకుతున్నారు . ఇక అంతేకాదు ఫైనాన్షియల్ సర్వీసెస్ తో వాట్సప్ కస్టమర్లకు సేవలు అందించనుంది .

మల్టీ డివైజ్ లో వాట్సప్ ఖాతా
మల్టి డివైస్‌లో వాట్సప్ ఖాతాను అనుమంతించే ఈ లక్షణాన్ని మొదట WABetaInfo గుర్తించినట్లు సదరు సంస్థ ట్వీట్ చేసింది. ఈ యాజమాన్యం దీనిపై వివరణ కూడా ఇచ్చారు. స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్ వంటి బహుళ పరికరాల్లో ఒకేసారి వినియోగదారులు తమ వాట్సాప్ ఖాతాను కనెక్ట్ చేయడానికి ఈ ఫీచర్ అనుమతిస్తుందని తెలిపింది. భవిష్యత్ లో వాట్సప్ మల్టీ డివైజ్ లకు కనెక్ట్ చేసే అవకాశం ఉంది . ఈ కొత్త ఫీచర్ ఒకే ఖాతా కోసం ప్రతి డివైస్ నుండి ఇండిపెండెంట్‌గా మల్టీ డివైస్‌లకు మద్దతును అందించే అవకాశం ఉంది. అయితే భవిష్యత్తులో బీటా విడుదలను కంపెనీ కొనసాగిస్తున్నందున దీని గురించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది .

వినియోగదారుల అవసరాలను బట్టి తన సేవలను , ఫీచర్లను విస్తరిస్తున్న వాట్సప్
ప్రస్తుతం వాట్సాప్ ఒకే ఖాతా కోసం ఒకసారి ఒక పరికరంలో మాత్రమే యాక్సెస్ చేయడానికి అనుమతిస్తున్న విషయం తెలిసిందే. ఈ వాట్సాప్ వెబ్ కోసం కూడా, ఫోన్‌లోని అనువర్తనానికి కనెక్ట్ అయినప్పుడు వినియోగదారుల ఖాతాను యాక్సెస్ చేయవచ్చు. అయితే WABetaInfo షేర్ చేసిన స్క్రీన్ షాట్ ప్రకారం, మెసేజింగ్ సేవ వినియోగదారులను Wi-Fi ద్వారా తమ న్యూ డివైస్‌కు కనెక్ట్ చేయమని అడుగుతుంది. వినియోగదారుల అవసరాలను బట్టి వాట్సప్ తన సేవలను , ఫీచర్లను విస్తరిస్తుంది.

వాట్సప్ పేమెంట్స్ మాత్రమే కాదు త్వరలో క్రెడిట్ సర్వీస్
ఇప్పటికే వాట్సాప్ మాతృసంస్థ ఫేస్‌బుక్ తన ఫైనాన్షియల్ సర్వీసులను మరింత విస్తరించాలని భావిస్తుంది . అందులో భాగంగా క్రెడిట్ సర్వీస్‌ను భారత్‌లో ప్రారంభించబోతుంది. దీనికి సంబంధించి ఫేస్‌బుక్ ఇప్పటికే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు కూడా పొందింది.ఈ ఫీచర్ మనకి పేమెంట్ల ఆప్షన్‌లో కూడా కనబడుతుంది. ప్రస్తుతం తొలిదశలోనే ఉన్న ఈ ఫీచర్ త్వరలో యూజర్స్‌కి అందుబాటులోకి రానుంది. ఇప్పటికే పేమెంట్స్ చేసుకోవడానికి వీలు కల్పిస్తున్న వాట్సాప్ త్వరలో ఇండియాలో వాట్సాప్ వాడుతూ అర్హులైన వారందరికి అవసరాల కోసం డబ్బును అప్పుగా ఇవ్వడానికి కూడా రెడీ అవుతుంది .
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications