Gold Rate Today: దేశంలో కొంత కాలంగా తగ్గుతున్న పసిడి ధరలు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో వెండి ధరలు మరింత చౌకగా మారిపోయాయి. అమెరికా పేరోల్ డేటా నేపథ్యంలో ధరలు రేంజ్ బౌండ్‌లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా నిన్నటి రేట్లనే కొనసాగిస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.55,350, ముంబైలో రూ.54,950, దిల్లీలో రూ.55,100, కలకత్తాలో రూ.54,950, బెంగళూరులో రూ.54,950, కేరళలో రూ.54,950, వడోదరలో రూ.55,000, జైపూర్ లో రూ.55,100, లక్నోలో రూ.55,100, మధురైలో రూ.55,350, నాశిక్ లో రూ.54,980 వద్ద విక్రయించబడుతున్నాయి.

ఇదే సమయంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధరలో ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతోంది. దీనివల్ల దేశంలోని అనేక నగరాల్లో తగ్గిన రిటైల్ గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.60,380, ముంబైలో రూ.59,950, దిల్లీలో రూ.60,100, కలకత్తాలో రూ.59,950, బెంగళూరులో రూ.59,950, కేరళలో రూ.59,950, వడోదరలో రూ.60,000, జైపూర్ లో రూ.60,100, లక్నోలో రూ.60,100, మధురైలో రూ.60,380, నాశిక్ లో రూ.59,980 వద్ద కొనసాగుతున్నాయి.
ఏపీలోని విజయవాడ, నెల్లూరు, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, అనంతపురంలలో తగ్గిన ధరలను పరిశీలిస్తే 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,950గా కొనసాగుతోంది. తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ లలో సైతం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి తాజా ధరలను పరిశీలిస్తే కిలోకు రూ.200 తగ్గటంతో తెలుగు రాష్ట్రాల్లో రూ.78,200 వద్ద వెండి విక్రయం జరుగుతోంది.


Click it and Unblock the Notifications