Gold Rate: పసిడి ప్రియులకు శుభవార్త.. రెండో రోజూ రూ.1600 తగ్గిన గోల్డ్, ఏపీ తెలంగాణలో

Gold Price Today: దేశీయంగా పసిడి ధరలు వరుసగా క్షీణతను నమోదు చేయటం కొనుగోలుదారులకు స్వల్ప ఊరటని అందిస్తోంది. గడచిన రెండు వారాల్లో గోల్డ్ ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త గరిష్ఠ స్థాయిలకు చేరి ఆభరణాల కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దసరా, దీపావళి కోసం షాపింగ్ చేద్దామనుకుంటున్న ప్రజలు తాజా తగ్గింపులపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.1500 తగ్గింపును నమోదు చేసింది. దీంతో వరుసగా రెండోరోజు కూడా దేశంలో పసిడి ధరల పతనం కొనసాగింది. దేశంలోని వివిధ నగరాల్లో తగ్గిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.6850, ముంబైలో రూ.6850, దిల్లీలో రూ.6865, కలకత్తాలో రూ.6850, బెంగళూరులో రూ.6850, కేరళలో రూ.6850, వడోదరలో రూ.6855, జైపూరులో రూ.6865, లక్నోలో రూ.6865, నాశిక్ లో రూ.6853, అయోధ్యలో రూ.6865, బళ్లారిలో రూ.6850, గురుగ్రాములో రూ.6865, నోయిడాలో రూ.6865గా కొనసాగుతోంది.

Good news as gold and silver rates falling continuing on second day Know AP TG rates

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.1600 తగ్గింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో తగ్గిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7473, ముంబైలో రూ.7473, దిల్లీలో రూ.7488, కలకత్తాలో రూ.7473, బెంగళూరులో రూ.7473, కేరళలో రూ.7473, వడోదరలో రూ.7478, జైపూరులో రూ.7488, లక్నోలో రూ.7488, నాశిక్ లో రూ.7476, అయోధ్యలో రూ.7488, బళ్లారిలో రూ.7473, గురుగ్రాములో రూ.7488, నోయిడాలో రూ.7488గా ఉన్నాయి.

ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6850గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7473 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1000 తగ్గి రూ.96,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

ఫెడ్ సమావేశం సమీపిస్తున్న వేళ దేశీయంగా గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గుతూ ఉన్నాయి. వాస్తవానికి డాలర్ రేటు పెరిగితే, బంగారం వెండిపై అడుగుపెట్టే పెట్టుబడులు తగ్గవచ్చు, తద్వారా ధరలు పడిపోతాయి. ఫెడ్ రేట్ల తగ్గింపు తర్వాత ఇన్వెస్టర్లు తమ డబ్బును ఇతర సాధనాల్లోకి తరలించవచ్చని తెలుస్తోంది. ఈ క్రమంలోనే చాలా మంది బంగారం, వెండి నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్లు తెలుస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో పండుగల షాపింగ్ షురూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+