Gold Price Today: శుభవార్త.. వారాంతంలో తగ్గిన బంగారం రేటు.. ధర చూసి కొనుక్కోండి..
Gold Price Today: డాలర్ రేటు బలపడటంతో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు ఒడిదొడుకుల మధ్య కొనసాగుతున్నాయి. డాలర్ రేటు పెరిగితే గోల్డ్ రేటు తగ్గుతుందని మనందరికీ తెలిసిందే. ఈరోజు సైతం రేట్లు తగ్గుముఖం పట్టాయి.
22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి కంటే 10 గ్రాములకు రూ.150 మేర తగ్గాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.55,100, ముంబైలో రూ.54,850, దిల్లీలో రూ.55,000, కలకత్తాలో రూ.54,850, బెంగళూరులో రూ.54,850, కేరళలో రూ.54,850, వడోదరలో రూ.54,900, జైపూర్‌లో రూ.55,000, కోయంబత్తూరులో రూ.55,100, పాట్నాలో రూ.54,900, నాగపూర్‌లో రూ.54,850, నాశిక్‌లో రూ.54,880, గురుగ్రామ్ లో రూ.55,000, బళ్లారిలో రూ.54,850 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు నిన్నటి కంటే రూ.160 మేర తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో రిటైల్ విక్రయ ధరలు గమనిస్తే.. చెన్నైలో రూ.60,110, ముంబైలో రూ.59,840, దిల్లీలో రూ.60,000, కలకత్తాలో రూ.59,840, బెంగళూరులో రూ.59,840, కేరళలో రూ.59,840, వడోదరలో రూ.59,890, జైపూర్‌లో రూ.60,000, కోయంబత్తూరులో రూ.60,110, పాట్నాలో రూ.59,890, నాగపూర్‌లో రూ.59,840, నాశిక్‌లో రూ.59,870, గురుగ్రామ్ లో రూ.60,000, బళ్లారిలో రూ.59,840గా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, విశాఖపట్నం, హైదరాబాదు, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ లలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,850గా ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,840గా రిటైల్ విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధరలను పరిశీలిస్తే.. నేడు కేజీకి రూ.500 తగ్గటంతో ధర రూ.77,000గా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications